Home /News /national /

UTTAR PRADESH YOGI GOVERNMENT NEW DECIDES FREE SMARTPHONES AND TABS FOR CRORE STUDENTS EVK

Uttar Pradesh: కోటి విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు.. యోగీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

త్వ‌ర‌లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh) ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో యోగీ ప్ర‌భుత్వం తాజాగా కొత్త నిర్ణ‌యం తీసుకొంది. రాష్ట్రంలో ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌ద‌వుతున్న కోటి మంది విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్ ఫోన్‌ (Smart Phone) లు, ట్యాబ్‌లు అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 25, 2021నమాజీ ప్ర‌ధాని, భార‌త ర‌త్న‌ వాజ్‌పేయి జ‌యంతి రోజు ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

ఇంకా చదవండి ...
    త్వ‌ర‌లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh) ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో యోగీ ప్ర‌భుత్వం తాజాగా కొత్త నిర్ణ‌యం తీసుకొంది. రాష్ట్రంలో ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌ద‌వుతున్న కోటి మంది విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్ ఫోన్‌లు (Smart Phones), ట్యాబ్‌లు అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 25, 2021న మాజీ ప్ర‌ధాని, భార‌త ర‌త్న‌ వాజ్‌పేయి జ‌యంతి రోజు ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఆరోజు ల‌క్ష‌మందికి స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు అందించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా ధ్రువీక‌రించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యేలా ప్ర‌భుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య నాథ్ (Yogi Aditya Nath) ఆరోజున 60వేల స్మార్ట్‌ఫోన్‌లు, 40వేల ట్యా బ్లను విద్యార్థుల‌కు అందిస్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

    ప్ర‌తి ప‌క్షాల విమ‌ర్శ‌లు.. ఎన్నిక‌ల స‌మ‌యం..
    ఈ ఎన్నిక‌ల్లో తిరిగి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. తాజాగా ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇటీవ‌ల మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ విమ‌ర్శ‌లు చేశారు.

    Delhi Pollution: నిర్మాణ పనులు, ట్రక్కుల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత‌.. రూల్స్ త‌ప్ప‌నిస‌రి!


    యోగీ ఆదిత్య‌నాథ్‌కు ల్యాప్‌టాప్ ఎలా వాడాలో కూడా తెలియ‌ద‌ని ఎద్దెవా చేశారు. ఈ నేప‌థ్యంలో యోగీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున స్మార్ట్ ఫోన్‌, ట్యాబ్‌లు అంద‌జేస్తున్నారు.

    డిసెంబ‌ర్ 25న స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు అంద‌జేయ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది. మొత్తం రూ. 2035 కోట్లు విడుద‌ల విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్ డివైజ్‌లు అందించేందుకు 24 కంపెనీలతో ప్ర‌భుత్వం ఒప్ప‌దం చేసుకొంది.

    Anti-Conversion Bill: మతమార్పిడి నాన్ బెయిలబుల్ నేరం.. 10 సంవత్సరాల జైలు.. బిల్లును ఆమోదించిన క‌ర్ణాట‌క క్యాబినెట్‌


    తొలి విడతలో పం పిణీ చేయబోయే పరికరాల కోసం రూ.2035 కోట్లు కేటాయిం చినట్టు చెప్పా రు. మొత్తం గా 10.50లక్షల స్మా ర్ట్ఫోన్లను ఒక్కో టి ₹10,740ల చొప్పు న, అలాగే, 7.20లక్షల ట్యా బ్లను ₹12,606 చొప్పు న కొనుగోలు చేసినట్టు వివరిం చారు.

    బీజేపీ (BJP) అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. ఇప్ప‌టికే ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభిస్తున్న ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) శ‌నివారం ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌తి ప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతే కాకుండా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Aditya Nath) ను ప్ర‌శంస‌ల‌తో ముచ్చెత్తారు. “UP+Yogi Bahut hai upyogi అంటూ ఆయ‌న అభినందించారు. ప్ర‌స్తుతం రాష్ట్రం "డబుల్ ఇంజన్ శ‌క్తితో అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Smart phone, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు