Home /News /national /

UTTAR PRADESH SP CHIEF AKHILESH YADAV SAYS KRISHNA CAME INTO HIS DREAM AND SAID HE WILL WIN EVK

Uttar Pradesh: శ్రీ‌ కృష్ణుడు నా క‌ల‌లోకి వ‌చ్చి చెప్పాడు.. నేను గెలుస్తాన‌ని: అఖిలేశ్ యాద‌వ్‌

ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (ఫైల్‌)

ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (ఫైల్‌)

Uttar Pradesh Assembly Elections | ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక వేడి పెరిగింది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇదే అద‌నుగా చాలా మంది నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్పీలో చేరారు. ఈ సంద‌ర్భంగా అఖిలేశ్ యాద‌వ్ స‌ర‌దాగా ప‌లు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఇంకా చదవండి ...
    ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ఎన్నిక వేడి పెరిగింది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇదే అద‌నుగా చాలా మంది నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. తాజాగా బీజేపీ (BJP)కి చెందిన ఎమ్మెల్యే ఎస్పీలో చేరారు. ఈ సంద‌ర్భంగా అఖిలేశ్ యాద‌వ్ స‌ర‌దాగా ప‌లు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని రామరాజ్యాన్ని స్థాపిస్తానని శ్రీ‌కృష్ణుడు ప్ర‌తీ రోజు త‌న క‌ల‌లోకి వ‌చ్చి చెప్పాడ‌ని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. జ‌న‌వ‌రి 3, 2022న బీజేపీకి చెందిన నాన్‌పరా ఎమ్మెల్యే మాధురీ వర్మను ఎస్‌పిలోకి చేర్చుకోవడానికి జరిగిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.

    కుర్మీ కులానికి చెందిన వర్మ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె 2010 నుంచి 2012 వరకు శాసన మండలి సభ్యురాలు కూడా. అంబేడ్క‌ర్ (Ambedkar) నగర్ మాజీ ఎంపీ రాకేష్ పాండే మరియు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి ఇతర నాయకులు కూడా SP లో చేరారు.

    Covid Vaccine: జోరుగా ట‌కా.. ఫ‌స్ట్‌డే సూప‌ర్.. ఎంత మంది టీనేజ‌ర్లు టీకా వేయించుకొన్నారో తెలుసా?


    మథుర నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పోటీకి దింపాలని బిజెపి నాయకుడు పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాసినట్లు వచ్చిన నివేదిక గురించి అడిగిన ప్రశ్నకు అఖిలేష్, “ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు నాకు కలలోకి వచ్చి మీరే (అఖిలేష్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. రామరాజ్యానికి మార్గం సమాజ్‌వాద్ [సోషలిజం] మార్గం ద్వారా. .సమాజ్‌వాద్‌ ఏర్పాటైన రోజే రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటు అవుతుంది. అని వ్యాఖ్యానించారు.

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే మా ప్రభుత్వం గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తుందని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. ఈ హామీని నెరవేర్చడానికి ఎస్పీ ప్రభుత్వం వివిధ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని అఖిలేష్ అన్నారు.

    Enhancing immunity in children: పిల్ల‌ల్ని కాపాడుకోండి.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!


    యూపీ ఎన్నిక‌ల‌పై స‌ర్వే..

    ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (Uttar Pradesh) ఎన్నిక‌లు దేశ రాజ‌కీయాల‌పై ఎంతో ప్ర‌భావితం చూపుతాయి. 80 పార్ల‌మెంట్ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ప‌ట్టు నిల‌బెట్టుకొంటే క‌చ్చితంగా ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌డం ఖాయం అనే అభిప్రాయం అంద‌రిలో ఉంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌రిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లుజ‌రుగుతున్నాయి. ఎన్నో పార్టీలో.. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఈ నేప‌థ్యంలో ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి. టైమ్స్ నౌ నవభారత్‌ (TimesNow Nava Bhart) కు చెందిన వీటో సంస్థ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అధికారంపై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం..

    సర్వే ప్రకారం, 403 మంది సభ్యుల సభలో బీజేపీ 230-249 సీట్లు కైవసం చేసుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 137-152 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు కైవసం చేసుకున్న బీఎస్పీ 9-14 స్థానాల్లో ఎక్కడైనా గెలుస్తుందని అంచనా వేసింది. మరోవైపు, కాంగ్రెస్ (Congress) పార్టీకి కేవలం 4-7 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేస్తోంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Akhilesh Yadav, Bjp, Samajwadi Party, UP Assembly Elections 2022, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు