Road Accident: ట్రక్ - వోల్వో బస్సు ఢీ... 18 మంది దుర్మరణం

ట్రక్ - వోల్వో బస్సు ఢీ... 18 మంది దుర్మరణం (File Image - credit - twitter)

Barabanki Road Accident: తెల్లారితే వాళ్లంతా తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాల్సిన వారు... కానీ... అనంత లోకాలకు వెళ్లిపోయారు. చీకట్లోనే వారి బతుకులు తెల్లారిపోయాయి.

  • Share this:
    Road Accident: ఈ అత్యంత విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్... బారాబంకీ జిల్లాలో జరిగింది. లక్నో-అయోధ్యా నేషనల్ హైవైపే సంభవించింది. రామ సనేహీ ఘాట్‌లో ఓ ట్రక్ వేగంగా వచ్చి.. వోల్వో బస్సును బలంగా ఢీకొట్టింది. దాంతో 18 మంది ప్రయాణికులు చనిపోగా... మరో 19 మంది గాయాలపాలయ్యారు. బస్సులో ఉన్నవారిలో... చాలా మంది వలస కూలీలే అని తెలిసింది. వారంతా... హర్యానా నుంచి బీహార్‌లోని తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. తమ వాళ్లను చూడాలనీ, కలుసుకోవాలనీ ఎంతో, ఎన్నో ఆశలతో వెళ్తుంటే... ఇలా జరిగిపోయింది.

    నిజానికి ప్రమాదం జరిగినప్పుడు బస్సు రోడ్డుపై లేదు. దానికి సాంకేతిక సమస్య ఏదో రావడంతో... రోడ్డు పక్కన ఆపి... డ్రైవర్ చెక్ చేస్తున్నారు. ప్రయాణికులను విశ్రాంతి తీసుకోమని చెప్పారు. తాను బస్సును రిపేర్ చేస్తానని అన్నారు. కానీ.. ఆ ట్రక్కు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో... పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

    ఇది కూడా చదవండి: Horoscope 28-7-2021: నేటి రాశి ఫలాలు.. బాధ్యతల భారం.. కొన్ని శుభ సంకేతాలు

    విషయం తెలియగానే రాజకీయ నేతలు, ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు అందరూ ఘటనా స్థలికి వచ్చి... రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. గాయపడిన వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని గుర్తించి... తమ తమ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Milk Chocolate Day: నేడు మిల్క్ చాక్లెట్ డే... పాలతో చేసిన చాక్లెట్లు ఎందుకు తినాలి?

    "ఈ ప్రమాదం చాలా దారుణంగా జరిగింది. కొంత మంది చనిపోయిన వారి మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి" అని లక్నో జోన్ ADG సత్య నారాయణ సబాత్ తెలిపారు. ఇదే కాదు ఉత్తరప్రదేశ్‌లోనే జులై 18 రాత్రి... ఆగ్రా-చందౌసీ హైవేపై 2 బస్సులు ఢీకొన్న ప్రమాదంలో... 8 మంది చనిపోయారు. అప్పుడు కూడా ఓ బస్సు టైర్ పంక్చర్ అవ్వడంతో... రోడ్డు పక్కన ఆపి సరిచేస్తుంటే... మరో బస్సు వచ్చి గుద్దేసింది. చనిపోయిన వారు ఉన్న బస్సులో వారంతా... ఓ మ్యారేజ్ పార్టీకి వెళ్లి వస్తున్నారు. శుభకార్యం కాస్తా విషాదంగా మారింది.
    Published by:Krishna Kumar N
    First published: