హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Uttar Pradesh: అస‌లు హిందువులు ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసు.. రాహుల్ ఓ యాక్సిడెంట‌ల్‌ హిందూ: యోగి ఆదిత్యానాథ్‌

Uttar Pradesh: అస‌లు హిందువులు ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసు.. రాహుల్ ఓ యాక్సిడెంట‌ల్‌ హిందూ: యోగి ఆదిత్యానాథ్‌

Uttar Pradesh Assembly Elections | ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల వేడి తారాస్థాయికి చేరుకొంటుంది. రోజుకు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు పెరిగాయి. తాజాగా యోగీ ఆదిత్యానాత్ రాహుల్ గాంధీపై విరుచుక‌ప‌డ్డారు. రాహుల్ గాంధీ యాక్సిడెంట‌ల్ హిందూ అని విమ‌ర్శించారు. దేశంలో అస‌లు హిందువులు ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు అని అన్నారు.

ఇంకా చదవండి ...

  ఉత్త‌ర్ ప్ర‌దేశ్  (Uttar Pradesh) ఎన్నిక‌ల వేడి తారాస్థాయికి చేరుకొంటుంది. రోజుకు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు పెరిగాయి. తాజాగా యోగీ ఆదిత్య‌నాథ్‌(Yogi Adityanath) రాహుల్ గాంధీపై విరుచుక‌ప‌డ్డారు. రాహుల్ గాంధీ యాక్సిడెంట‌ల్ హిందు అని విమ‌ర్శించారు. దేశంలో అస‌లు హిందువులు ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు అని అన్నారు. రాహుల్ యాక్సిడెంట్ హిందూ అని చెప్ప‌డానికి యోగి గ‌తంలో రాహుల్ గాంధీ గుజ‌రాత్ ప‌ర్య‌న‌ను ఊటంకించారు. రాహుల్ గుజరాత్లోని ఓ గుడికి వెళ్లినప్పు డు అక్క డ మోకాళ్లపై కూర్చున్నా రని, అప్పు డు అర్చకుడు ఆయనతో ఇది మసీదు కాదని ఆగ్రహం వ్య క్తం చేశారని.. పద్మాసనంలో కూర్చో మని చెప్పా రని యోగి తెలిపారు. ఆ సంస్కారం గురిం చి తెలియనివారు కూడా ఇప్పు డు హిం దువులకు, హిం దుత్వ కు మధ్య భేదం పై పాఠాలు బోధిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  Uttar Pradesh: యూపీ పీఠం ఎవ‌రిదంటే.. తాజా స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు!

  ఎన్నిక‌లు రాగానే హిందువులమ‌ని ప్ర‌చారం..

  జ‌న‌వ‌రి 3, 2022న అమేఠీలో యోగీ ఆదిత్య‌నాథ్ రూ.86.42 కోట్లతో నిర్మిం చిన 200 పడకల ఆసుపత్రిని ప్రారంభిం చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాం గ్రెస్ నేతలు ఎన్నిక‌లు రాగానే ఆలయాల చుట్టూ తిరుగుతూ తామే నిజమైన హిం దువులమని ప్రచారం చేసుకోవ‌డానికి ఉవ్విళ్లురుతార‌ని యోగీ ఎద్దెవా చేశారు. ప్రజలు వారికన్నా తెలివైన వారని, ఎవరు హిందుత్వ వాదులో వారికి బాగా తెలుసని అన్నా రు.

  Uttar Pradesh: శ్రీ‌ కృష్ణుడు నా క‌ల‌లోకి వ‌చ్చి చెప్పాడు.. నేను గెలుస్తాన‌ని: అఖిలేశ్ యాద‌వ్‌

  ఆ వ్యాఖ్య‌లకు కౌంట‌ర్‌గానే ప్ర‌స్తుతం యోగీ విమ‌ర్శ‌లు గుప్పించారు. గతంలో నెహ్రూ తాను యాక్సిడెంట్ హిందూ అని చెప్పుకొనేవార‌ని బీజేపీ శ్రేణులు ఎప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటాయి. తాజాగా యోగీ కూడా రాహుల్‌ను యాక్సిడెంట‌ల్ హిందూ అని విమ‌ర్శించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకొంది.

  రాహుల్ గాంధీ ఏం అన్నారు..

  Omicron: ఒమిక్రాన్ ఓ సాధార‌ణ వైర‌ల్‌ ఫివ‌ర్‌.. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు: యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌

  యోగీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డానికి గతంలో రాహుల్ విమ‌ర్శ‌లే కార‌ణం. ఆయ‌న డిసెంబ‌ర్‌లో కాంగ్రెస్ జైపుర్ ర్యాలీలో పాల్గొని బీజేపీపై విమ‌ర్శ‌లు చేశారు.  జైపూర్ స‌భ‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)  హిందూ, ‘హిందుత్వవాది’ రెండు వేర్వేరు పదాలని, దేశం హిందువులదే తప్ప హిందుత్వవాదులది కాదని మండిపడ్డారు. జైపూర్‌ (Jaipur)లో జరిగిన ‘మెహంగాయ్ హటావో మహా ర్యాలీ’లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, “నేడు దేశ రాజకీయాల్లో రెండు పదాల ఘర్షణ ఉంది. ఒక పదం హిందూ, మరో పదం హిందుత్వ. నేను హిందువుని, హిందువాదిని కాదు. హిందువు (Hindu) మరియు హిందువాది  మధ్య వ్యత్యాసం ఏమిటంటే, హిందువు సత్యం కోసం శోధిస్తాడు, దానిని సత్యాగ్రహం అంటారు, కానీ హిందూవాది అధికారం కోసం శోధిస్తుంది అని అన్నారు.

  First published:

  ఉత్తమ కథలు