హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం సీరియస్.. ఐసీయూలో చికిత్స.. అసలేం జరిగిందంటే..

మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం సీరియస్.. ఐసీయూలో చికిత్స.. అసలేం జరిగిందంటే..

ములాయం సింగ్ యాదవ్ (ఫైల్)

ములాయం సింగ్ యాదవ్ (ఫైల్)

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హర్యానాలోని గురుగ్రామ్ ఆస్పత్రికి తరలించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) (Mulayam Singh Yadav) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హర్యానాలోని మేదాంతా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను టెస్ట్ చేసిన వైద్యులు, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 82 ఏళ్ల సమాజ్ వాది పార్టీ నాయకుడి ఆరోగ్యం ఒక్కసారిగా సీరియస్ కావడంతో వెంటనే ఆయనను ICU కి తరలించారు. కాగా, తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన నేతాజీ అని ములాయం సింగ్ పేర్కొన్నారు.

అతను ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య.. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే.. ఆయన మొదటి భార్య మాల్తీ దేవి 2003లో మరణించింది. అఖిలేష్ యాదవ్ మాల్తీ దేవికి జన్మించాడు.

ఇదిలా ఉండగా పంజాబ్ లోని (Punjab) మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఫెమస్ గాయకుడు సిద్ధూ మూసేవాలాను (Sidhu Moose Wala) అతని ఇంటి వద్ద కొంత మంది దుండగులు అతి కిరాతకంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ హత్యకు సంబంధించిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తాజాగా, ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన గ్యాంగ్ స్టర్ దీపక్ టిను (Deepak Tinu) పంజాబ్ లోని మన్సాలో పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నాడు. కాగా, మాన్సా పోలీసులు.. మరో కేసులో గోయింద్వాల్ సాహిబ్ జైలు నుంచి ప్రొటక్షన్ వారెంట్‌పై తీసుకురాగా శనివారం రాత్రి తప్పించుకున్న టినూను పట్టుకునేందుకు మాన్‌హాంట్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.

టిను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సన్నిహితుడు, పంజాబీ గాయకుడి (Punjabi singer) హత్య కేసులో నిందితుడు కూడా. ప్రస్తుతం ఈ ఘటనతో పంజాబ్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా పోలీసులను రంగంలోనికి దింపారు. నిందితుడి కోసం అనువణువు జల్లెడ పడుతున్నారు. ఈ సంఘటన గురించి బటిండా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖ్విందర్ సింగ్ చినా ఫోన్‌లో మాట్లాడుతూ, "నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నామని, దీని కోసం పోలీసు పార్టీలు పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసు అధికారి ముఖ్విందర్ సింగ్ చినా తెలిపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Akhilesh Yadav, Hospitals, Uttar pradesh

ఉత్తమ కథలు