సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) పరిస్థితి ఆదివారం విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రత్యేకమైన మందులు ఇస్తున్నట్లు సమాచారం.
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై మేదాంత ఆసుపత్రి ప్రకటన
"ములాయం సింగ్ యాదవ్ జీ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయనకు అత్యవసర మందులను ఇస్తున్నట్లు గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను.. ఐసియులో సమగ్ర నిపుణుల బృందంచే చికిత్స పొందుతున్నారని డాక్టర్ సంజీవ్ గుప్తా చెప్పారు. కాగా, 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ తన రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, పరీక్షల కోసం ఆగస్టు 22 నుండి చికిత్స పొందుతున్నారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అకస్మాత్తుగా మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు.
ఇదిలా ఉండగా బీహార్ సీఎం నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
బీహార్ లో 3,500 కిలోమీటర్ల జన్ సూరాజ్(Jan Suraj) పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్.. నితీశ్ కుమార్ తనను ఇంటికి ఆహ్వానించాడని, జేడీయూ(JDU)లో చేరి పార్టీని నడిపించాలని ఆఫర్ చేశాడని ఈ నెల 5న ఆరోపించారు. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పీకేని తన రాజకీయ వారసుడని కూడా పిలిచారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నితీష్ కుమార్ తనను తన రాజకీయ వారసుడిగా చేసినా, తన కోసం సిఎం కుర్చీని ఖాళీ చేసినా తాను అతనితో కలిసి పని చేయనని అన్నారు.
ఆ సీఎం పదవి ఇచ్చిన తనకు వద్దని పేర్కొన్నారు. పీకే చేసిన ఈ వ్యాఖ్మలే ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. ప్రశాంత్ కిషోర్ చేసేవి నిరాధార ఆరోపణలని శనివారం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. " ప్రశాంత్ కిషోర్‌ను నేను ఆహ్వానించలేదు. పీకేనే స్వయంగా నన్ను కలవడానికి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏది కావాలంటే అది మాట్లాడనివ్వండి. దానితో మాకు సంబంధం లేదు. నాలుగైదేళ్ల క్రితమే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ పీకే నాకు సలహా ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నాడు"అని నితీష్ అన్నారు.
నితీష్ వ్యాఖ్యలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. దీనితీశ్ కుమార్ చెప్పేవన్నీ అసత్యాలన్నారు. నితీష్ కుమార్ ఏదో చెప్పాలనుకుంటాడు కానీ ఇంకేదో మాట్లాడుతున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దీనిని ఇంగ్లీషులో బీయింగ్ డెల్యూషనల్ అంటారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తాను జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమన్నానని చెబుతూనే, బీజేపీ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నానని నితీష్ ఆరోపించడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hospitals, Uttar pradesh