హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ముఖ్యమంత్రి యోగి పై అభిమానం.. ఏకంగా ఆలయం నిర్మించుకుని విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే..

ముఖ్యమంత్రి యోగి పై అభిమానం.. ఏకంగా ఆలయం నిర్మించుకుని విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే..

రాముడి లాగా యోగి విగ్రహం

రాముడి లాగా యోగి విగ్రహం

Uttar Pradesh:  సీఎం యోగి ఆదిత్యానాథ్ కు ఆ గ్రామస్థులు ప్రత్యేకంగా గుడిని నిర్మించారు. అంతే కాకుండా అక్కడ రాముడి లాగా సీఎం యోగి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అయోధ్య జిల్లాలో సీఎంయోగి ఆదిత్యనాథ్ (Yogi adityanath) కోసం ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్థానికులు యోగిని రాముడి అవతారంగా కొలుస్తారు. అందుకే ఆయనను ధనస్సు పట్టుకున్న విధంగా విగ్రహన్నికూడా ఏర్పాటు చేశారు. భరత్‌కుండ్ సమీపంలోని పూర్వా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రతిరోజూ రెండుసార్లు పూజలు చేస్తుంటారు. ప్రజలు పెద్ద ఎత్తున హజరవుతుంటారు. వీరికి ప్రసాదాలు కూడా పంపిణి చేస్తుంటారు.

భరత్‌కుండ్ రాముడు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు అతని సోదరుడు భరతుడు అతనికి వీడ్కోలు పలికిన ప్రదేశం అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని అయోధ్య నివాసి ప్రభాకర్ మౌర్య నిర్మించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని 2015లో మౌర్య ప్రతిజ్ఞ చేశారు. శ్రీ మౌర్య మాట్లాడుతూ తాను రాముడి కోసం చేసినట్లే ప్రతి రోజూ యోగి ఆదిత్యనాథ్ విగ్రహం ముందు శ్లోకాలు పఠిస్తూ ఉంటానని చెప్పాడు.

యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన తన స్నేహితుడు రెండు నెలల్లో రాముడిని పోలిన యోగి ఆదిత్యనాథ్‌ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి దాదాపు ₹ 8.5 లక్షలు ఖర్చు చేసినట్టుగా పేర్కొన్నారు. గతేడాది పూణెలో ప్రధాని నరేంద్ర మోడీకి ఓ బీజేపీ కార్యకర్త ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది.

హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పురాతన, చారిత్రాత్మకమైన ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ ఆలయంలో ప్రతి నెల రోహిణి నక్షత్రం 27వ రోజున స్వామివారి అలంకరణ జరుగుతుంది. అలంకరణ సమయంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS, Yogi adityanath

ఉత్తమ కథలు