Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: May 24, 2019, 11:29 AM IST
యూపీ కాంగ్రెస్ ఛీప్ అయిన నటుడు రాజ్ బబ్బర్ ఫతేపూర్ సిక్రీ నుంచి ఓటమి
దేశ రాజకీయాల్లో సత్తా చాటాలంటే... ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలన్నది సర్వత్రా వినిపించే సమీకరణం. అందుకు తగ్గట్టుగానే ఇదివరకు అక్కడి 80 స్థానాల్లో 71 సీట్లు దక్కించుకున్న బీజేపీ... ఈసారి 79 స్థానాలకు పోలింగ్ జరగ్గా... 62 సీట్లను గెలుచుకొని... తిరుగులేని పార్టీగా అవతరించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వచ్చిన సీట్లకు ఈ 62 సీట్లు చేరి... మొత్తం 303 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించిన పార్టీగా మరోసారి బీజేపీ రికార్డ్ సృష్టించింది. ఇదే సమయంలో... ఈసారి మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఎంత దారుణంగా ఓడిందంటే... ఆ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీలో కూడా కాంగ్రెస్‌కి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అమేథీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పోటీ చెయ్యగా... అక్కడ రెండోసారి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ బంపర్ మెజార్టీ సాధించి... రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇక రాయ్ బరేలీలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ గెలిచినప్పటికీ... 2014లో కంటే తక్కువ మెజార్టీతో గెలిచారు. ఇలా యూపీలో కాంగ్రెస్ దక్కించుకున్నది ఒకే ఒక్క స్థానం అయ్యింది. అది కూడా సోనియా గాంధీ కాబట్టి గెలిచారనుకోవచ్చు.
ప్రియాంక గాంధీని దింపినా : ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనుకున్న కాంగ్రెస్... యూపీ తూర్పు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి అప్పగించింది. ఆమె... మూడు రోజులు గంగా యాత్ర చేసి, అన్ని వర్గాల ప్రజలనూ కలిసి, రకరకాల రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐతే, ఎన్ని చేసినా కాంగ్రెస్ తలరాత మాత్రం మారలేదు. యూపీలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అవడంతో... ఓటమికి బాధ్యతగా... ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ (U-PCC) రాజ్ బబ్బర్ రాజీనామాకు సిద్ధపడ్డారు. ఐతే... రాజీనామాను కాంగ్రెస్ ఆమోదిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
జగన్ కోసం కాన్వాయ్ రెడీ... ప్రత్యేకతలేంటో తెలుసా...
తిరుగులేని వైసీపీ... లోక్ సభలో 4వ అతి పెద్ద పార్టీ...
ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?
ఆ 23కి ఈ 23తో చెక్ పెట్టారా... మే 23న వైసీపీ ఇరగదీసిందిగా...
Published by:
Krishna Kumar N
First published:
May 24, 2019, 11:29 AM IST