అన్నంత పని చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...

CAA, NRCకి వ్యతిరేకంగా రోడ్లెక్కి ప్రభుత్వ, ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారుల ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించిన యూపీ సీఎం అన్నంత పనిచేశారు.

news18-telugu
Updated: December 26, 2019, 8:48 PM IST
అన్నంత పని చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నంత పని చేశారు. CAA, NRCకి వ్యతిరేకంగా రోడ్లెక్కి ప్రభుత్వ, ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారుల ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించిన యూపీ సీఎం అన్నంత పనిచేశారు. నిరసనలకు దిగడంతోపాటు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన 373 మంది ఆందోళనకారుల ఆస్తులను జప్తు చేయనున్నారు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. మొరాదాబాద్‌కు చెందిన 200 మంది , లక్నో (110), గోరఖ్‌పూర్ (34), ఫిరోజాబాద్ కు చెందిన 29కి నోటీసులు అందించారు పోలీసులు. డిసెంబర్ 10 నుంచి 24 మధ్య CAA ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు నిరసనకారుల మీద మొత్తం 213 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి 925 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5558 మందిని పట్టణాలు, నగర బహిష్కరణ విధించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు 81 కేసులు నమోదు చేశారు. 120 మందిని అరెస్ట్ చేశారు. 7513 ట్విట్టర్ పోస్టులు, 9076 ఫేస్ బుక్ పోస్టులు, 172 యూట్యూబ్ వీడియోల మీద చర్యలు తీసుకున్నారు. CAA ఆందోళనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 288 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో 61 మంది పోలీసులకు తుపాకీ గుండ్లు తగిలాయి.

First published: December 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు