అక్కడ కేజీఎఫ్ తరహాలో బంగారు కొండలు... 3000 టన్నుల గోల్డ్...

యూపీలోని హార్ది ప్రాంతంలో 646.15 టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్టు చెబుతున్నారు. గోల్డ్ హిల్స్‌లో 2843.25 టన్నుల బంగారాన్ని గుర్తించారు.

news18-telugu
Updated: February 22, 2020, 10:45 AM IST
అక్కడ కేజీఎఫ్ తరహాలో బంగారు కొండలు... 3000 టన్నుల గోల్డ్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు కేజీఎఫ్ సినిమా చూశారా? అందులో గోల్డ్ మైన్స్ ఉంటాయి. బంగారాన్ని గనుల్లో నుంచి తవ్వుకుంటూ ఉంటారు. అందులో చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అలాంటి బంగారు గనులు ఇప్పుడు మరోచోట బయటపడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో బంగారం గనులు వెలుగుచూశాయి. యూపీలోని సోన్‌భద్రలో పురాతత్వ శాస్త్రవేత్తలు సుమారు 15 సంవత్సరాలుగా శోధిస్తున్నారు. అయితే, ఎనిమిది సంవత్సరాల క్రితం 2012లో అక్కడ బంగారు కొండలు ఉన్నట్టు గుర్తించారు. భూగర్భంలో సుమారు 3వేల టన్నుల బంగారం ఉన్నట్టు అంచనా వేశారు. ఇప్పుడు ఆ బంగారం తవ్వకాలకు ఈ-ఆక్షన్ నిర్వహిస్తున్నారు. 2005 సంవత్సరంలో జీఎస్‌ఐ బంగారం కోసం అన్వేషణ ప్రారంభించింది. తీవ్రమైన పరిశోధనల తర్వాత బంగారాన్ని గుర్తించారు. హార్ది ప్రాంతంలో 646.15 టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్టు చెబుతున్నారు. గోల్డ్ హిల్స్‌లో 2843.25 టన్నుల బంగారాన్ని గుర్తించారు.

ఇప్పుడు ఆ గోల్డ్ బ్లాక్స్‌‌ను వేలం వేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్వహించే ఈ టెండర్ ముందు ఏడుగురు సభ్యులతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ బృందం సభ్యులు మొత్తం బంగారం ఉందని భావిస్తున్న ప్రాంతం మొత్తానికి జియో ట్యాగింగ్ చేస్తారు. ఈనెల 22వ తేదీలోపు వారు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. సోన్‌భద్రలో బంగారం నిక్షేపాలతో పాటు పొటాషియం, ఇనుము నిక్షేపాలను కూడా గుర్తించారు. సోన్‌భద్ర జిల్లాలో యురేనియం నిక్షేపాలు కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు