యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలనం.. బీరుకి, గోసంరక్షణకి లింక్

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌లో బీరు, విదేశీ మద్యం బాటిళ్ల మీద అదనపు సెస్‌ను విధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో గోసంరక్షణ చేపట్టనుంది.

  • Share this:
    అక్కడ బీరు తాగారంటే.. మీరు కూడా గో సంరక్షణ చేసినట్టే. విచిత్రంగా ఉన్నా. ఇది నిజం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇది అమలు కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌ కేబినెట్ ఈనెల 18న ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం.. రాష్ట్రంలో బీరు, విదేశీ మద్యం మీద ఫీజు పెంచింది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో గో సంక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ బ్రాండ్ మద్యం ఒక్కో బాటిల్ మీద రూ.10 అదనంగా రుసుము వసూలు చేస్తారు. రెస్టారెంట్లు, బార్లలో ఇది అమలవుతుంది. ఇక ఒక్కో బీరు మీద రూ.5 అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుంది. అలాగే, బాటిళ్ల తయారీ మీద కూడా సెస్ విధించింది. ఒక్కో బాటిల్ ధర మీద రూపాయి నుంచి రూ.3 వరకు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాలి. ఇంపోర్ట్ పర్మిట్ ఫీజులను కూడా యూపీ ప్రభుత్వం పెంచింది. ఒక్కో బాటిల్ మీద 50 పైసల నుంచి రూ.2వరకు అదనపు ట్యాక్స్ విధించింది.

    మద్యం అమ్మకాలు, లిక్కర్ సేల్స్, పబ్బులు క్లబ్బులు బార్లు వైన్ షాపులు, liquor, liquor sales, record liqour sales, sales, liquor sales in sa, sunday liquor sales, liquor record sales, wine and liquor sales, liquor store, liquor sales on new year, black friday liquor sales, liquor sales in telangana, black friday liquor sales farmington, liquor sale, alcohol sales, liquor stores, liquor asmr, liquor store for sale, liquor prices, liquor mart, sales asmr, 7 day sales, buy liquor store, liqueur, telangana, telangana news, telangana songs, telangana folk songs, telangana video songs, telangana latest news, telangana elections 2018, telangana culture, telangana formation day, telangana election result, telangana election results, telangana election results 2018, telangana formation day song 2018, telangana formation day special song, telangana formation day celebrations, etv telangana, telangana govt, telangana song, great telangana,
    మద్యం (File)


    యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.165 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాలను బట్టి ఈ అంచనా వేశారు.

    ప్రతీకాత్మక చిత్రం


    ఈ ఏడాది జనవరి 2న యూపీ ప్రభుత్వం గో సంరక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టింది. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లపై తిరుగుతూ ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న గోవులను సంరక్షించేందుకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

    36 cows found dead in a cowshed in dwarka district of delhi
    ప్రతీకాత్మక చిత్రం


    అయితే, ఆ గోవులకు ఆలనా పాలన చూసుకోవడానికి నిధులు అవసరం కాబట్టి, మద్యం అమ్మకాల మీద అదనపు పన్నులు వేసి, తద్వారా వచ్చే డబ్బును గోసంరక్షణ కోసం వినియోగించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    yogi, yogi adityanadh, Yogi Adityanath, UP, UP news, యోగి, యోగి ఆదిత్యనాథ్, యూపీ, యూపీ న్యూస్
    యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్


    మద్యం మీద అదనపు పన్నుల ప్రతిపాదనను ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అమలు చేయకతప్పడం లేదు. ఓ వైపు మద్యం మీద అదనపు సెస్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఉత్పత్తి పెంచుకోవడానికి డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది.

    ఇవి కూడా చదవండి

     

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో నాకు ఎన్టీఆర్‌కు న్యాయం లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు


    ఇవి కూడా చదవండి

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అన్నగారి పాత్ర చేసిన నటుడెవరో తెలుసా..

    బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మళ్లీ మొదలైన కోల్డ్ వార్..

    టాలీవుడ్ వార‌సుల‌పై ర‌కుల్ ప్రీత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
    First published: