UP Girl Scheme: ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ప్రతి బాలికకు రూ.15,000

ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ప్రతి బాలికకు రూ.15,000 (ప్రతీకాత్మక చిత్రం)

Girl Scheme: ఈమధ్య ప్రభుత్వాలు పోటీపడి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఐతే... డబ్బంతా ఈ పథకాలకే అయిపోతోందనే వాదన కూడా ఉంది. ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అంటున్న ప్రభుత్వాలు పథకాలు అమలుచేస్తూనే ఉన్నాయి.

  • Share this:
    UP Girl Scheme: కేంద్రంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో రకరకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేద, మధ్య తరగతి వారికి వీటి ద్వారా ఎంతో కొంత ఆర్థిక సాయం లభిస్తోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బాలికలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కన్య సుమంగళ యోజన (Kanya Sumangala Yojana) కింద ప్రతి కుటుంబంలో బాలికలకు ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రతి అమ్మాయికీ రూ.15,000 ఇస్తామనీ... ఆ డబ్బును ఆరు దశల్లో (6 installments) ఇస్తామని చెప్పింది. ఈ డబ్బు కారణంగా... బాలిక పెరిగే కొద్దీ... ఆమె కంటూ ఓ ఆర్థిక సాయం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది.

    ఎవరు అర్హులు?
    ఈ పథకం కింద అర్హత పొందేవాళ్లు తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్‌లో శాశ్వత నివాసం కలిగివుండాలి. ప్రతి కుటుంబంలో ఇద్దరు కూతుర్లు ఈ ప్రయోజనం పొందగలరు. కుటుంబ యజమాని ఆదాయం సంవత్సరానికి రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే... ఈ ప్రయోజనం లభించదు. అంతేకాదు... ఇద్దరు కంటే ఎక్కువ కూతుర్లు ఉంటే... మొదట పుట్టిన ఇద్దరికే ఇది వర్తిస్తుంది. ఐతే... మొదటి కాన్పులో గానీ, రెండో కాన్పులో గానీ కవల ఆడపిల్లలు పుట్టి ఉంటే... అలాంటి కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలకు ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

    ఎలా ఇస్తారు?
    ఈ పథకం కింద.. ఆడ పిల్ల పుట్టినప్పుడు ప్రభుత్వం ఆమె పేరున బ్యాంక్ అకౌంట్ తెరిచి... రూ.1200 జమ చేస్తుంది. అలాగే బాలికకు వ్యాక్సిన్ వేయించినప్పుడు మరో రూ.1000 ఇస్తుంది. ఫస్ట్ క్లాస్‌లో చేరినప్పుడు రూ.4000 ఇస్తుంది. ఆరో తరగతికి వెళ్లినప్పుడు రూ.2000 ఇస్తుంది. అలాగే... తొమ్మిదో తరగతికి వెళ్లినప్పుడు రూ.3000 ఇస్తుంది. 10వ తరగతి నుంచి 12వ తరగతి చదివే సమయంలో రూ.5000 ఇస్తుంది.

    ఇది కూడా చదవండి: Horoscope 21-7-2021: ఈ రాశుల వారికి లక్ష్య సిద్ధి.. వారికి తొలగనున్న రుణ బాధలు

    ఈ స్కీమ్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్ విజిట్ చెయ్యవచ్చు. https://mksy.up.gov.in/women_welfare/index.php

    ఈ స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్లు:
    పాప తండ్రి ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, నేమ్, అడ్రెస్ సర్టిఫికెట్, స్థిర నివాస పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు రావాలని కొందరు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: