UTTAR PRADESH ELECTIONS PRIME MINISTER MODI INAUGURATES GANGA EXPRESSWAY OTHER SIDE IT RAIDS ON OPPOSITION EVK
Uttar Pradesh Elections: ఇటు 594కి.మీ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం.. అటు ఐటీ దాడులు
ప్రధాని నరేంద్ర మోదీ
Uttar Pradesh Elections | ఉత్తర్ ప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అభివృద్ధి పథకాల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అంతా చుట్టివేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి పక్షాలపై ఐటీ దాడులు ఉత్తర్ ప్రదేశ్‌లో హాట్ టాపింగ్ మారాయి. షాజహాన్పూర్లో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వే (Ganga Express Way) ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ శనివారం శంకుస్థాపన చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) అభివృద్ధి పథకాల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అంతా చుట్టివేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి పక్షాలపై ఐటీ దాడులు ఉత్తర్ ప్రదేశ్‌లో హాట్ టాపింగ్ మారాయి. షాజహాన్పూర్లో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వే (Ganga Express Way) ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 18, 2021న (శనివారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది 594 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే అని దేశంలోనే అతి పొడవైనదని అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఈ మార్గం కొత్త తలుపులు తెరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది.
ఇది మీరట్‌లోని బిజౌలి గ్రామం నుంచి ప్రారంభమై ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు దగ్గర ముగుస్తుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని అన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఐటీ శాఖ దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యం సమాజ్‌వాదీ పార్టీ నేతల ఇళ్లపై దాడులను అఖిలేశ్ యాదవ్ ఖండించారు. "బీజేపీలో ఓటమి భయం ఎంత పెరుగుతుందో దాడులు అంతే ఎక్కువగ పెరుగుతాయని" అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పలువురు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ కేంద్ర ఐటీ విభాగం సోదాలు చేస్తుండటంపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో నాడు కాంగ్రెస్ చేసిన పనే నేడు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. ఐటీ దాడులను ముందే ఊహించామని, రాబోయే రోజుల్లో సీబీఐ, ఈడీ లాంటి సంస్థల నుంచి బెదింరింపులు వస్తాయని అఖిలేశ్ అన్నారు.
కేంద్ర ఆదాయపన్ను విభాగం(ఐటీ) అధికారులు ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాజీవ్ రాయ్, మనోజ్ యాదవ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో ఆర్థిక కలాపాలు సాగిస్తోన్న పలువురు ఎస్పీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం ఉదయం మొదలైన ఈ సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు అవినీతి ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు, ప్రాథమిక ఆధారాలు లభించడంతో సోదాలకు ఉపక్రమించినట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.