హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘తప్పులు ఎవరు చేసిన వదిలే ప్రసక్తే లేదు..’.. బహిరంగంగా హెచ్చరించిన యోగీ ఆదిత్యనాథ్..

‘తప్పులు ఎవరు చేసిన వదిలే ప్రసక్తే లేదు..’.. బహిరంగంగా హెచ్చరించిన యోగీ ఆదిత్యనాథ్..

సమావేశంలో మాట్లాడుతున్న మోదీ

సమావేశంలో మాట్లాడుతున్న మోదీ

Uttar pradesh: యూపీలో నేరాలు ఎవరు చేసిన వదిలే ప్రసక్తే లేదని, జీరో టాలరెన్స్ విధానంతో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi adityanath) జౌన్‌పూర్‌లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, స్థానికంగా జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. మోదీ 2017కి ముందు రాష్ట్రాన్ని నడిపిన పార్టీల డీఎన్ఏలోనే అవినీతి ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. యూపీలో అల్లర్లలో పాల్గొన్న వారికి పట్టిన గతి.. అవినీతిపరులకు కూడా పడుతుందని హెచ్చరించారు. అదే విధంగా.. "ప్రతి 'కాం' (పని)కి 'దాం' (ధర) ముందే నిర్ణయించబడింది. లంచగొండితనం, అవినీతి (గత ప్రభుత్వాల హయాంలో) ఒక వేపచెట్టులా పెరిగిపోయిదని అన్నారు. దీని ఫలితాలు అందరికీ తెలుసని, UP ప్రజలు దానికి మూల్యం చెల్లించవలసి వచ్చిందని కూడా ప్రస్తావించారు.

గత ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాలు తమ సొంత కాంట్రాక్టర్లు, సహాయకులకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించబడ్డాయని విమర్శించారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 2007 నుండి 2012 వరకు ఉత్తరప్రదేశ్‌ను పాలించింది. 2012 నుండి 2017 వరకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) రాష్ట్రాన్ని పాలించింది. “ఈ రోజు, యుపి నివాసి బయట (రాష్ట్రం) వెళ్ళినప్పుడు, అతన్ని గౌరవంగా చూస్తారు. అయితే, ఐదేళ్ల క్రితం పరిస్థితి అలా లేదు.. ఎందుకంటే బయటకు వెళ్లవలసిన యువకులు గుర్తింపు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలు తమ గుర్తింపును దాచుకోవలసి వచ్చిందని సీఎం ఆదిత్యనాథ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేరాలు, నేరస్థుల పట్ల జీరో టాలరెన్స్ అనే విధానంతో పని చేసిందని మరియు "దేశంలో కొత్త విశ్వాసాన్ని నింపిందని ఆయన నొక్కి చెప్పారు. "ప్రజలు యుపి మోడల్‌ను అంగీకరించారు. రాష్ట్రంలో నేరాలు, నేరస్థులకు చోటు లేదు. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అల్లర్లు లేని రాష్ట్రంగా మారిందని ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దేశంలోనే "ఉదాహరణ" ('నజీర్')గా మారుతున్నాయని, మెరుగైన శాంతిభద్రతలు పెట్టుబడి, ఉపాధి అవకాశాలను ముందుకు తీసుకువెళుతున్నాయని ఆయన అన్నారు.

ఎవరైన అల్లర్లకు పాల్పడితే వారి ముందు తరాలు సంపాదించిన ఆస్తులను లాక్కోవాల్సి వస్తుందని అల్లరి మూకలకు గుణపాఠం చెప్పిన తొలి రాష్ట్రం యూపీ. అవినీతిపరుల కోసం ఈ పోరాటాన్ని చేపట్టబోతున్నాం. అవినీతిపరులు సంపాదించిన ఆస్తులను ప్రజల కోసం ఉపయోగించాలని, ఈ విషయంలో పెద్దఎత్తున ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని యోగీ అన్నారు.

First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS, Yogi adityanath

ఉత్తమ కథలు