హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్.. వైద్యుల సూచన మేరకు..

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్.. వైద్యుల సూచన మేరకు..

శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలను పాటించని వారికి భారీ జరిమానాలు కూడా తప్పవని సీఎం హెచ్చరించారు.

శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలను పాటించని వారికి భారీ జరిమానాలు కూడా తప్పవని సీఎం హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కార్యాలయంలో పనిచేసే అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్నటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్.. ‘కరోనా ప్రారంభ లక్షణాలు కనిపించడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాను. ఆ రిపోర్ట్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తున్నాను. అన్ని పనులను వర్చువల్‌ రీతిలో చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఇక, కొద్ది రోజుల క్రితమే సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ప్రజలంతా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ఇటీవల యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు.


ఇక, గడిచిన 24 గంటల్లో యూపీలో కొత్తగా 17,963 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 85 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఏప్రిల్ 30 వరకు మూసివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రోజువారిగా 100కు పైగా కొత్త కేసులు నమోదవుతున్న జిల్లాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అధికారులను ఆదేశించింది.


అఖిలేష్ యాదవ్‌‌కు కూడా కరోనా పాజిటివ్..

మరోవైపు యూపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని అఖిలేష్ యాదవ్ నేడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు అఖిలేష్ యాదవ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని అభ్యర్థించారు.

First published:

Tags: Akhilesh Yadav, Coronavirus, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు