యూపీలో మరో నగరం పేరు మార్పు... త్వరలోనే...

ఇప్పటికే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ముఘల్‌సరాయ్‌‌ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌ నగర్‌గా మార్చిన సీఎం యోగి... తాజాగా ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 10:50 PM IST
యూపీలో మరో నగరం పేరు మార్పు... త్వరలోనే...
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల పేర్లను మార్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... తాజాగా మరో నగరం పేరు మార్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ముఘల్‌సరాయ్‌‌ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌ నగర్‌గా మార్చిన సీఎం యోగి... తాజాగా ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పేరుకు గల చారిత్రక విశిష్టతపై అధ్యయనం చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రాలోని అంబేద్కర్ యూనివర్సిటీని కోరింది. ప్రభుత్వ ప్రతిపాదనను యూనివర్సిటీలో చరిత్ర విభాగం పరిశీలిస్తోంది.

ఇదే విషయాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ ధ్రువీకరించినట్టు ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ఆగ్రా నగరానికి పూర్వం మరేదైనా పేరు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయో లేదో అధ్యయనం చేయాలంటూ ప్రభుత్వం నుంచి తమకు లేఖ అందిందని సుగమ్ ఆనంద్ తెలిపారు. ఈ విషయమై తాము అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సుగమ్ ఆనంద్ పేర్కొన్నారు. తాజ్ మహల్‌కు నిలయమైన ఆగ్రా నగరం అసలు పేరు ఆగ్రావన్ అని కొందరు చరిత్రకారులు చెబుతున్న నేపథ్యంలోనే ఆగ్రా పేరును మార్చేందుకు యోగి సర్కారు సిద్ధమైనట్టు చెబుతున్నారు.

First published: November 18, 2019, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading