Home /News /national /

UTTAR PRADESH BOAT TRAGEDY AT LEAST 20 KILLED AS BOAT CAPSIZES IN YAMUNA PAH

ఘోర ప్రమాదం.. నదిలో బోల్తాపడిన పడవ.. 20 మంది దుర్మరణం.. ఎక్కడంటే..

రెస్క్యూ చేపట్టిన అధికారులు

రెస్క్యూ చేపట్టిన అధికారులు

Uttar pradesh: యమునా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పడవ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ఉన్న వారంతా చూస్తుండగానే నీళ్లలోకి పడిపోయి గల్లంతయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
ఉత్తరప్రదేశ్‌లో  (Uttar pradesh) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాందాలోని యమునా నదిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. దీంతో అది ఒక వైపుకు వాలిపోయింది. పడవలో ఉన్న ప్రయాణికులు.. భయభ్రాంతులకు గురయ్యారు. చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు. పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు (Boat tragedy)  గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు.

బోల్తాపడిన పడవలో.. 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. స్థానికంగా ఉన్న అధికారులు అక్కడికి చేరుకున్ని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు నది దగ్గరకు చేరుకుని తమ వారికోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సంఘటన స్థలానికి ప్రత్యేక పడవల్లో వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.



ఇదిలా ఉండగా గురుగ్రామ్ లోని నైట్ క్లబ్ లో షాకింగ్ ఘటన జరిగింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలోని  (Delhi) గురుగ్రామ్ లో ఉన్న కాసా డాన్జా క్లబ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నలుగురు మహిళలు,తమ స్నేహితుడితో కలిసి నైట్ క్లబ్ కు వచ్చారు. అప్పుడు 8 నుంచి 10 మంది బౌన్సర్ వారిలోని ఒక యువతిని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ ఉన్న మరికొందరు బౌన్సర్ లు రెచ్చిపోయారు. యువతలను బయటకు తోసేశారు. అంతే కాకుండా.. అడ్డుకున్న బాయ్ ఫ్రెండ్ ను ఇష్టమోచ్చినట్లు కొట్టారు.

యువతులు వద్దని వారించిన, కనికరం చూపలేదు. యువతులను, వారితో వచ్చిన వ్యక్తిని చితకొట్టారు. అంతే కాకుండా బాధితుల దగ్గర ఉన్నడబ్బులను కూడా లాక్కున్నారు. ప్రస్తుతం ఈ ఘటనను అక్కడ ఉన్న కొంత మంది వీడియో రికార్డు చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ గా (Viral video) మారింది. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Boat accident, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు