హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఘోరప్రమాదం.. నదిలో బోల్తాపడిన ట్రాక్టర్.. 25 మంది దుర్మరణం..

ఘోరప్రమాదం.. నదిలో బోల్తాపడిన ట్రాక్టర్.. 25 మంది దుర్మరణం..

ప్రమాదం జరిగిన ప్రదేశం

ప్రమాదం జరిగిన ప్రదేశం

Uttar pradesh: కాన్పూర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా చెరువులో పడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) ఘోర ప్రమాదం సంభవించింది. కాన్పూర్‌లో శనివారం భక్తులతో వస్తున్న ట్రాలీ రోడ్డుపై ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో.. 11 మంది చిన్నారులతో సహా 11 మంది మహిళలు సహా 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాక్టర్ లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, యాత్రికులతో ట్రాక్టర్ ట్రాలీ ఉన్నావ్ నుంచి తిరిగి వస్తోంది. కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడి ప్రమాదానికి (Road accident) గురైంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. అధికారులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi adityanath) కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. "కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకంగా ఉంది.. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్, ఇతర సీనియర్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు .ఘటనపై ప్రధాని మోదీ (PM MOdi)  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అంతే కాకుండా.. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎమ్ కేర్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించబడుతుంది. అదే విధంగా గాయపడిన వారికి రూ. 50,000 సహాయంగా ఇవ్వబడుతుందని పిఎంఓ ట్వీట్‌లో తెలిపింది.

ఇదిలా ఉండగా  ఢిల్లీలోని (Delhi) ఘజియాబాద్ లోని రాంలీలా మైదాన్ లో షాకింగ్ ఘటన సంభవించింది.

అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ లో కొందరు సరదాగా గడపానికి వచ్చారు. వారంతా.. స్వింగ్ రైడ్ ఎక్కికూర్చున్నారు. అది వేగంగా తిరుగుతుంది. అక్కడున్న వారంతా అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో స్వింగ్ ఐరన్ రాడ్ నుంచి ఊడిపోయింది. వెంటనే అది స్పీడ్ గా ఎగిరి బయటవైపుకు వచ్చి పడింది.అక్కడే ఉన్న నలుగులు వ్యక్తుల గాయపడ్డారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.

గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. వీరిలో ముగ్గురుపిల్లలు, ఒక మహిళ ఉన్నారు. వెంటనే వీరందరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh