ఫైరింగ్ చేయలేదు.. తక్కువ ఫోర్స్‌నే ఉపయోగించాం : ఢిల్లీ పోలీస్

జామియా యూనివర్సిటీలో ప్రవేశించి పోలీసులు విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.

news18-telugu
Updated: December 16, 2019, 5:17 PM IST
ఫైరింగ్ చేయలేదు.. తక్కువ ఫోర్స్‌నే ఉపయోగించాం : ఢిల్లీ పోలీస్
ఢిల్లీ పోలీస్ పీఆర్వో రంధవా(Image : ANI/Twitter)
  • Share this:
జామియా యూనివర్సిటీలో ప్రవేశించి పోలీసులు విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. వర్సిటీలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారన్న ఆరోపణలను కూడా ఖండించారు. చాలా తక్కువ ఫోర్స్‌ను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అంతేకాదు,విద్యార్థులపై ఎక్కడా కాల్పులు జరపలేదన్నారు.నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో 30మంది పోలీసులు గాయాలపాలైనట్టు చెప్పారు. గాయాలపాలైన పోలీసుల్లో ఏసీపీ,డీసీపీ హోదా కలిగినవాళ్లు కూడా ఉన్నారన్నారు. ఢిల్లీ పోలీస్ పీఆర్వో రంధవా ఈ వివరాలు వెల్లడించారు.

అల్లర్లకు పాల్పడినవారిని పట్టుకునేందుకే యూనివర్సిటీలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.అల్లర్లపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు
చేసినట్టు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతారని చెప్పారు. కాగా,ఎన్‌ఆర్‌సీ,పౌరసత్వ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ జామియా యూనివర్సిటీ విద్యార్థులు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జి చేశారు. ఈ క్రమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలో పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది.First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు