అమెరికా మూన్ మిషన్ సక్సెస్‌కి కారణమదే : మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త శంభాజీ

గతంలో అమెరికా చంద్రుడి పైకి తమ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించేందుకు 38 సార్లు ప్రయత్నించి విఫలమైందని గుర్తుచేశారు. కానీ 39వ సారి చేసిన ప్రయోగంలో భారత కాల గణన వ్యవస్థను పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు.

news18-telugu
Updated: September 10, 2019, 10:56 AM IST
అమెరికా మూన్ మిషన్ సక్సెస్‌కి కారణమదే : మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త శంభాజీ
శంభాజీ భిడే (File Photo)
  • Share this:
చంద్రయాన్-2 వైఫల్యం నేపథ్యంలో మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త శంభాజీ భిడే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రుడిపై అమెరికా చేపట్టిన ప్రయోగం సక్సెస్ కావడానికి కారణం.. అక్కడి సైంటిస్టులు ఏకాదశి రోజున స్పేస్ క్రాఫ్ట్‌ను లాంచ్ చేయడమని చెప్పారు. గతంలో అమెరికా చంద్రుడి పైకి స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించేందుకు 38 సార్లు ప్రయత్నించి
విఫలమైందని గుర్తుచేశారు. కానీ 39వ సారి చేసిన ప్రయోగంలో భారత కాల గణన వ్యవస్థను పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు.అందులో భాగంగా ఏకాదశి రోజున వారు స్పేస్ క్రాఫ్ట్‌ను లాంచ్ చేసి విజయవంతం అయ్యారని అన్నారు.హిందు క్యాలెండర్ ప్రకారం ఏకాదశి అనేది అమావాస్య-పౌర్ణమిల మధ్య 11వ రోజు వస్తుందని.. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుని అమెరికా ప్రయోగం జరిపిందని అన్నారు. ఏకాదశిని ఆధ్యాత్మిక దినంగా పాటిస్తారని, చాలామంది ఆరోజు ఉపవాసం ఉంటారని చెప్పారు.

కాగా, భిడె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తన తోటలో కాసిన మామిడిపండ్లను తినడం ద్వారా కొంతమంది మహిళలు మగపిల్లలకు జన్మనిచ్చారని అప్పట్లో వివాదాస్పద కామెంట్స్ చేశారు.First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading