హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

US Visa: వీసా వెయిటింగ్ పీరియడ్‌పై అమెరికా కీలక ప్రకటన.. ఇండియన్స్‌కు మద్దతుగా నిర్ణయాలు

US Visa: వీసా వెయిటింగ్ పీరియడ్‌పై అమెరికా కీలక ప్రకటన.. ఇండియన్స్‌కు మద్దతుగా నిర్ణయాలు

US Visa: భారతీయులకు అమెరికా వీసా రావడంలో ఆలస్యం.. రాజ్యసభలో కేంద్రం వివరణ

US Visa: భారతీయులకు అమెరికా వీసా రావడంలో ఆలస్యం.. రాజ్యసభలో కేంద్రం వివరణ

US Visa: వీసా వెయిటింగ్ పీరియడ్ తగ్గించటానికి తమ శక్తినంతా ఉపయోగిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో భారతీయులకు మద్దతుగా నిర్ణయాలు ఉంటాయని ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విద్య (Education), ఉద్యోగం (Job) కోసం చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమెరికా(US) వీసా కోసం చాలా మంది భారతీయులు కలలు గంటారు. అన్ని అర్హతలు ఉన్నవారు అప్లై చేసినా కూడా, ఈ వీసా కోసం కొన్నిసార్లు చాలారోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గించటానికి తమ శక్తినంతా ఉపయోగిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది.

కరోనావైరస్ సంబంధిత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత యూఎస్ వీసాల కోసం అప్లికేషన్స్ పెరిగిన దేశాల్లో ఇండియా ఒకటి. తొలిసారి వీసా కోసం ట్రై చేసేవారు, ముఖ్యంగా B1(బిజినెస్), B2 (టూరిస్ట్) కేటగిరీల కింద అప్లై చేసుకునే వారు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి రావటంపై అభ్యర్థుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

* భారత్‌కు మద్దతుగా నిర్ణయాలు

వీసా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు తమ కాన్సులర్ అధికారులను భారత్‌కు పంపించటంతో పాటు జర్మనీ, థాయ్‌లాండ్‌లో కూడా ఓవర్‌సీస్‌ ఎంబసీలను ప్రారంభించినట్లు వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు. ఇండియాలోని తమ రాయబార కార్యాలయంలో తమ సిబ్బందికి సహాయం చేసేందుకు అదనపు అధికారులను పంపిస్తున్నామని, మార్నింగ్ షిఫ్ట్స్‌, వీకెండ్స్‌లో కూడా పని చేయిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా సందర్శకుల వీసాల కోసం ఇంటర్వ్యూలు చేసేందుకు నిరంతరాయంగా పని చేస్తున్నామని తెలిపారు.

గతేడాది అత్యధికంగా స్టూడెంట్ వీసాలు పొందిన రికార్డును భారత్ బద్దలు కొట్టిందని, ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుందని స్టఫ్ చెప్పారు. అమెరికాకు వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్యలో భారత్ ఇప్పుడు రెండో స్థానంలో ఉందని తెలిపారు. సందర్శకులకైతే ఈ-వీసా తెచ్చే ఆలోచన చేస్తున్నామని, ఇంటర్వ్యూ అవసరం లేని సందర్భంలో వీసా రెన్యువల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

* కాస్త తగ్గిన వెయిటింగ్ పీరియడ్

స్టూడెంట్స్, టెక్ వర్కర్స్‌, పర్మినెంట్‌గా యూఎస్‌కు వెళ్లాలనుకున్నవారు, సముద్రయాన సిబ్బందికి వీసాలు జారీ చేసేందుకు అమెరికా కాన్సులర్ సిబ్బంది కృషి చేస్తున్నారు. H-1B, L1 వంటి ఉద్యోగ వీసాలు పొందేందుకు ఉండే ఇంటర్వ్యూకి యావరేజ్‌గా 18 నెలలు పట్టేది. ఇప్పుడు ఆ సమయం 60 రోజులకు తగ్గింది.

ఇది కూడా చదవండి : అమెరికా ఇక మారదా..? ఇంకెన్నాళ్లీ తుపాకుల మోత..? 

కరోనా సమయంలో చాలా వరకు వీసాల జారీ ఆగిపోయిందని, ఇప్పుడు పెరిగిన డిమాండ్ మేరకు పని చేయటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి చెప్పారు. ఒక్కో వీసా కేటగిరీలో వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికీ 400 రోజులకు పైగా ఉందని, గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగైనా, ఈ వెయిటింగ్ పీరియడ్‌ను 120 క్యాలెండర్ డేస్‌కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఆమోదయోగ్యమైన సమయంగా భావిస్తున్నామన్నారు.

First published:

Tags: India, International news, National News, USA, Visa

ఉత్తమ కథలు