మహాత్మాగాంధీకి గోల్డ్ మెడల్: యూఎస్ కాంగ్రెస్ ప్రతిపాదన

మహాత్మాగాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న అంశాన్ని ఆగస్ట్‌లో న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ సందర్భంగా కాంగ్రెస్‌వుమెన్ కరోలిన్ మలోనీ ప్రస్తావించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తీర్మానం చేశారు.

news18-telugu
Updated: October 2, 2018, 5:32 PM IST
మహాత్మాగాంధీకి గోల్డ్ మెడల్: యూఎస్ కాంగ్రెస్ ప్రతిపాదన
మహాత్మ గాంధీ ఫైల్ ఫోటో
  • Share this:
అహింస, శాంతితో స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన మహాత్మాగాంధీకి ప్రతిష్టాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలని అమెరికా చట్టసభలో ప్రతిపాదించారు. కాంగ్రెస్‌వుమెన్ కరోలిన్ మలోనీతో పాటు నలుగురు ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు అమీ బేరా, రాజా క్రిష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ ఈ ప్రతిపాదన చేశారు. కాంగ్రెషనల్ కాకస్ ఆన్ ఇండియా అండ్ ఇండియన్ అమెరికన్స్ కో-ఛైర్‌పర్సన్ తుల్సీ గబ్బార్డ్ కూడా తీర్మానానికి మద్దతు తెలిపారు. ఈ తీర్మానాన్ని కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కమిటీ ఆన్ హౌజ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించారు.

కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అమెరికా కాంగ్రెస్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. గతంలో కొద్దిమంది విదేశీయులకు మాత్రమే ఈ పురస్కారాన్ని ఇచ్చింది అమెరికా. అందులో మదర్ థెరెసా(1997), నెల్సన్ మండేలా, (1998), పోప్ జాన్ పాల్-2 (2000), దలైలామా (2006), ఆంగ్ సాన్ సూ కీ (2008), మహ్మద్ యూనస్ (2010), షిమాన్ పెరెస్ (2014) ఉన్నారు. వాస్తవానికి మహాత్మాగాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న అంశాన్ని ఆగస్ట్‌లో న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ సందర్భంగా కాంగ్రెస్‌వుమెన్ కరోలిన్ మలోనీ ప్రస్తావించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తీర్మానం చేశారు.

ఇవి కూడా చదవండి:

గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి అరుదైన ఫొటోలు..!

PICS: సొంత రాష్ట్రం గుజరాత్‌తో గాంధీజీ అనుబంధం..!

PICS: శిథిలావస్థకు చేరిన పోరుబందర్‌లోని గాంధీ స్మృతి భవన్

గాంధీజీ 150వ జయంతి: జాతిపితకు కేసీఆర్ నివాళిPics: సిద్ధిపేటలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు..!

Pics: మహాత్ముడి విగ్రహానికి పూలమాలలేసి జగన్ నివాళులు..!

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
Published by: Santhosh Kumar S
First published: October 2, 2018, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading