కొడుకు సివిల్స్ టాపర్...తండ్రి పెట్రోల్ బంకులో వర్కర్...పిల్లల చదువు కోసం ఏం చేశాడో తెలుసా ?

పెట్రోల్ బంకులో సాధారణ వర్కర్‌గా పనిచేసే మనోజ్ కుమార్ కుమారుడు సివిల్స్ టాపర్‌గా నిలిచాడు...ఇంతకాలం తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందంటూ మనోజ్ సంతోషపడుతున్నారు. తన కుమారుడు ప్రదీప్ సింగ్ అతి చిన్న వయస్సులోనే సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.

news18-telugu
Updated: April 7, 2019, 7:30 PM IST

ఇటీవల విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఇండోర్‌కు చెందిన ప్రదీప్ సింగ్ ఆలిండియా లెవల్లో 93వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ప్రదీప్ సింగ్ తండ్రి మనోజ్ సింగ్ ఒక పెట్రోల్ బంకులో పనిచేసే సాధారణ వర్కర్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన కుమారుడు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని మనోజ్ ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే కొడుకు పడిన కష్టానికి ఫలితం దక్కిందన్నారు.

కుమారుడి కోరిక మేరకే సివిల్స్ కోచింగ్ తీసుకోమని ప్రోత్సహం అందించానన్నారు. ముఖ్యంగా కోచింగ్, పుస్తకాలు కొనుగోలుకు డబ్బు సమస్య రాకుండా చాలా కష్టపడ్డానని...తన పిల్లల చదువు కోసం ఉన్న ఇల్లు సైతం అమ్ముకున్నట్లు మనోజ్ తన అనుభవాలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే 22 సంవత్సరాల ప్రదీప్ ఇండోర్‌లోని ఐఐపీఎస్ నుంచి బీకామ్ పూర్తి చేశాడు. అలాగే ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు.
Loading...

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...