హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఈ శునకం మామూలుది కాదు.. ఏకంగా విగ్రహం పెట్టేశారు.. ఎందుకంటే..

ఈ శునకం మామూలుది కాదు.. ఏకంగా విగ్రహం పెట్టేశారు.. ఎందుకంటే..

టింకీ (Tinki) అనే శునకానికి ఉత్తరప్రదేశ్​లో ఏకంగా విగ్రహమే కట్టేశారు. అది చేసిన సేవ ఏంటంటే..

టింకీ (Tinki) అనే శునకానికి ఉత్తరప్రదేశ్​లో ఏకంగా విగ్రహమే కట్టేశారు. అది చేసిన సేవ ఏంటంటే..

టింకీ (Tinki) అనే శునకానికి ఉత్తరప్రదేశ్​లో ఏకంగా విగ్రహమే కట్టేశారు. అది చేసిన సేవ ఏంటంటే..

  కేసులను ఛేదించడంలో పోలీసులకు జాగిలాలు (Dogs) ఎంతో ముఖ్యం. వాసనను బట్టి నిందితులను, అనుమాన వస్తువులను శునకాలు పట్టించేస్తాయి. కేసులను దాదాపు పరిష్కరించేంత పని చేస్తాయి. ఇలా చాలా సందర్భాల్లో ముఖ్యమైన కేసులను పూర్తి చేయడంలో, నిందితులను పోలీసులకు పట్టించడంలో జాగిలాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే పోలీసులు సైతం శునకాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇలా ఎనలేని సేవలు అందించిన జాగిలానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి గుర్తుగా ఏకంగా పోలీస్​ స్టేషన్ ముందే ప్రతిమను ఉంచారు.

  టింకి అనే జర్మన్ షెపర్డ్(German Shepherd) జాతి శునకానికి ఈ గౌరవం దక్కింది. 49 క్రిమినల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు సేకరించిన ఈ శునకానికి ఉత్తరప్రదశ్​లోని ముజఫర్​నగర్​ పోలీసులు ఇలా విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకు ముజఫర్​పూర్​ సిటీ ఎస్పీ అర్పిత్​ విజయ్​వర్ఘీయ, రూరల్ ఎస్పీ అతుల్ కుమార్​, సర్కిల్ ఆఫీసర్ కుల్​దీప్ కుమార్ సహా పలుపులు పోలీసు అధికారులు హాజయయ్యారు. సీనియర్ డాగ్ హ్యాండ్లర్​ సునీల్ కుమార్.. టింకీ ప్రతిమను ఆవిష్కరించారు.

  జర్మన్​షెఫర్డ్ జాతికి చెందిన టింకీ.. గ్వాలియర్​లోని బీఎస్​ఎఫ్ అకాడమీ పరిధిలోని నేషనల్ డాగ్ సెంటర్ ద్వారా విధుల్లో చేరింది. తొలుత ముజఫర్​పూర్​లోని ఓ కానిస్టేబుల్​ వద్ద స్నిఫర్ డాగ్​గా చేరింది. కేసులను ఛేదించడంతో దిట్టగా మారడంతో టింకీకి ఆరేళ్లలోనే ఆరుసార్లు ప్రమోషన్ వచ్చింది.

  మొత్తంగా 49 కేసుల్లో కీలకమైన ఆధారాలను ఈ శునకం పట్టించింది. ఎనిమిదేండ్ల వయసులో గతేడాది నవంబర్​లో మృతి చెందింది.

  First published:

  Tags: Dog

  ఉత్తమ కథలు