హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UPI Payments: ఇంటర్‌చేంజ్‌ ఫీజు ఎఫెక్ట్..ఇక ఆ యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై అదనపు ఛార్జీలు

UPI Payments: ఇంటర్‌చేంజ్‌ ఫీజు ఎఫెక్ట్..ఇక ఆ యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై అదనపు ఛార్జీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2023 ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌చేంజ్‌ ఫీజు అమల్లోకి వస్తుంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(PPI) అయిన వ్యాలెట్‌లు లేదా కార్డ్‌ల ద్వారా జరిగే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్‌లపై ఈ ఫీజు విధిస్తారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

UPI Payments: ప్రస్తుతం చాలా మంది యూపీఐ(UPI) వినియోగదారుల్లో.. ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై అదనపు ఛార్జీలు చెల్లించాలా? లేదా? అనే సందేహం నెలకొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) చేసిన ఓ కొత్త ప్రకటన ఈ గందరగోళానికి దారితీసింది. దీంతో ఇంటర్‌చేంజ్ ఛార్జీల గురించి ఎన్‌పీసీఐ స్పష్టత ఇచ్చింది. UPI ద్వారా బ్యాంక్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. అంటే వర్చువల్‌ పేమెంట్‌ అడ్రెస్‌, క్యూఆర్‌ కోడ్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు వంటి మూడు పద్ధతుల్లో జరిపే సాధారణ UPI ట్రాన్సాక్షన్‌లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇప్పుడు ఎన్‌పీసీఐ లేటెస్ట్‌ అప్‌డేట్‌ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

* ఏప్రిల్ 1 నుంచి వచ్చే మార్పులు ఏంటి?

2023 ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌చేంజ్‌ ఫీజు అమల్లోకి వస్తుంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(PPI) అయిన వ్యాలెట్‌లు లేదా కార్డ్‌ల ద్వారా జరిగే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్‌లపై ఈ ఫీజు విధిస్తారు. అయితే ట్రాన్సాక్షన్‌లో పేమెంట్‌ రిసీవ్‌ చేసుకున్న మెర్చంట్‌ లేదా వ్యక్తి ఇంటర్‌చేంజ్‌ ఫీజు కింద 1.1 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌చేంజ్ ఫీజు అనేది మెర్చంట్‌ నుంచి రిసీవర్ బ్యాంక్/పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ వసూలు చేస్తాయని గుర్తించాలి. సింపుల్‌గా.. కస్టమర్ ఒక నిర్దిష్ట కంపెనీకి చెందిన వ్యాలెట్‌ని వినియోగించి, మరొక కంపెనీకి చెందిన వ్యాలెట్‌ ఉపయోగిస్తున్న మెర్చంట్‌కి పేమెంట్‌ చేస్తే ఛార్జీ వర్తిస్తుంది.

* ఛార్జీలు ఏంటి?

వివిధ వర్గాల మెర్చంట్స్‌కు ఇంటర్‌చేంజ్ ఫీ మారుతూ ఉంటుంది. ఇది 0.5 శాతం నుంచి 1.1 శాతం వరకు మొదలవుతాయి. నిర్దిష్ట వర్గాలలో లిమిట్‌ కూడా వర్తిస్తుంది. టెలికాం, విద్య , యుటిలిటీస్/పోస్టాఫీసుల కోసం, ఇంటర్‌చేంజ్ ఫీజు 0.7 శాతం. సూపర్ మార్కెట్‌లకు 0.9 శాతం ఉంది. ఇన్సూరెన్స్‌, ప్రభుత్వం, మ్యూచువల్ ఫండ్‌లు, రైల్వేలకు 1 శాతం, ఫ్యూయల్‌కి 0.5 శాతం, వ్యవసాయానికి 0.7 శాతం ఛార్జీలు విధిస్తారు. ఇంటర్‌చేంజ్ ఛార్జీలు PPI మెర్చంట్‌ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని, కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీలు ఉండవని NPCI ఒక ప్రకటనలో తెలిపింది.

* ఏ ట్రాన్సాక్షన్‌లపై ఇంటర్‌చేంజ్ ఫీజు ఉండదు?

పీపీఐ వ్యాలెట్‌, బ్యాంక్‌ అకౌంట్‌ మధ్య జరిగే.. పీర్-టు-పీర్ ట్రాన్సాక్షన్‌లు, పీర్-టు-పీర్-మర్చంట్ ట్రాన్సాక్షన్‌లపై ఇంటర్‌చేంజ్ ఫీజు వర్తించదని NPCI తెలిపింది. ముఖ్యంగా, మెర్చంట్‌ QR కోడ్‌ల ద్వారా చేసే డిజిటల్ వ్యాలెట్‌ ట్రాన్సాక్షన్‌లకు మాత్రమే ఈ ఛార్జీ వర్తిస్తుంది.

ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా? అయితే ఈ మిస్టేక్స్‌ చేస్తారేమో జాగ్రత్త!

* ప్రస్తుత UPI ట్రాన్సాక్షన్‌ ఛార్జీలు

ప్రస్తుతం, UPI ద్వారా చేసే ట్రాన్సాక్షన్‌లపై ఎటువంటి ఛార్జీలు లేవు. ప్రభుత్వం ఇప్పటివరకు UPI లావాదేవీలకు జీరో-ఛార్జ్ ఫ్రేమ్‌వర్క్‌ను తప్పనిసరి చేసింది. దీని అర్థం వినియోగదారులు, వ్యాపారులకు UPI ఛార్జీలు ఉండవు.

* PPI అంటే ఏంటి?

ప్రీపెయిడ్ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మొబైల్/పేమెంట్‌ వ్యాలెట్‌లు (Paytm Wallet, Amazon Pay Wallet, PhonePe Wallet), స్మార్ట్ కార్డ్‌లు, స్ట్రిప్ కార్డ్‌లు, పేపర్ వోచర్‌లు మొదలైనవి ఉంటాయి. PPIల ద్వారా ఒక వ్యక్తి డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు.

First published:

Tags: Google pay, Phone pay, UPI, Upi payments

ఉత్తమ కథలు