28 స్థానాల్లో పోటీ చేస్తాం... ప్రకాష్‌రాజ్ మద్దతిచ్చే ఛాన్సుంది... ఉపేంద్ర కామెంట్స్

కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ‘ప్రజాకీయ’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.

కొత్త పార్టీల ఆవిర్భావంతో దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో కొత్తదనం కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ నటుల సందడి పెరుగుతోంది. ఎవరికి వాళ్లు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సంచలనాల హీరో ఉపేంద్ర ఈసారి ప్రభావం చూపిస్తామంటున్నారు.

  • Share this:
కర్ణాటకలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 28 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు కన్నడ నటుడు ఉపేంద్ర. ఆయన స్థాపించిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారిస్తోంది. ఆ పార్టీకి ఎన్నికల సంఘం ఆటో గుర్తు కేటాయించింది. ఇంతకుముందు ఉపేంద్ర... కర్నాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కేపీవీపీ)ని స్థాపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారే. కొన్ని విబేధాల వల్ల ఆ పార్టీని ఆయనే వదిలేశారు. ఇప్పుడు యూపీపీ తరపున అవసరమైతే తాను కూడా పోటీ చేస్తానన్నారు ఉపేంద్ర. ఎక్కడ నుంచీ పోటీ చేసేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. మూడు వారాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌కి మద్దతుపై ఉపేంద్ర ఆసక్తికరంగా మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి సరైన మేనిఫెస్టోతో వస్తే... మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాము అందరిలా రాజకీయాలు చేసేందుకు పార్టీ పెట్టలేదన్న ఉపేంద్ర... తన సినిమాల్లో లాగే డైలాగ్స్ కొట్టారు. ప్రజలు ఏది కోరితే అదే చేస్తామనీ, ప్రజా నిర్ణయాల్ని స్వాగతిస్తామని అన్నారు.

 

Video: పిల్లల్ని కనండి..జనాభాను పెంచండి: చంద్రబాబు
First published: