ప్రధాని మోదీకి ఉపాసన సూటి ప్రశ్న... ఒక్క ట్వీట్‌తో సంచలనం

సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుంది.

news18-telugu
Updated: October 20, 2019, 10:36 AM IST
ప్రధాని మోదీకి ఉపాసన సూటి ప్రశ్న... ఒక్క ట్వీట్‌తో సంచలనం
ప్రధాని మోదీకి ఉపాసన సూటి ప్రశ్న... ఒక్క ట్వీట్‌తో సంచలనం
  • Share this:
బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశంపట్ల చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడ్డారు. బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ..... దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుంది.

ఉపాసన ట్వీట్


మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను ఆయన కలిశారు.

మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖ సినీ తారలతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి ఢిల్లీలో కలుసుకొన్నారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తదితరులు హాజరయ్యాురు. ఈ సమావేశం ప్రధాని అధికారిక నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టెలివిజన్, సినిమా తారలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.


ఇవికూడా చూడండి:
ర్యాంప్ వాక్ చేస్తూ విద్యార్థిని మృతి
First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు