Home /News /national /

UP TO RS 10000 FINE FOR WHO DRINK OR COOK IN OPEN IN GOA BA

గోవా వెళ్లే మందుబాబులకు హెచ్చరిక.. బీచ్‌లో బీర్ కొడితే...

విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30

విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30

గోవాలో బహిరంగంగా మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా వారిపై రూ.2వేల నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    గోవా వెళ్దాం. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేద్దాం. ఇసుక తిన్నెల మీద, సముద్రపు అలలను చూస్తూ చక్కగా ఫుల్లుగా మందు కొడదాం అనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే, గోవా ప్రభుత్వం మద్యం బాబులకు షాక్ ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారికి రూ.2000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించనుంది. ఒక్క బీచ్‌లోనే కాదు, గోవాలో ఎక్కడైనా సరే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్నమాట.

    karnataka, Benguluru, Drinking Alcohol Injuries to health, alcohol addiction, murder mystery in Karnataka, కర్ణాటక, మద్యం సేవించి, మూడేళ్ల తర్వాత మర్డర్ మిస్టరీ, యశవంతపుర
    నమూనా చిత్రం (Photo: Reuters)


    మద్యం మీదే కాదు, మరో కండిషన్ కూడా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో వంట చేయకూడదు. చాలా మంది టూరిస్టులు బహిరంగ ప్రదేశాల్లో చిన్న చిన్న స్టవ్‌లు పెట్టుకుని వాటి మీద వంట వండుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వం గుర్తించింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో కుక్కింగ్ మీద కూడా నిబంధనలు విధించింది.

    Telangana Elections 2018 | Polling Day | ఎన్నికల అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా తెలంగాణలో మనీ, మద్యం, తాయిలాల పంపిణీ కొనసాగుతూనే ఉంది. సాధారణ తనిఖీల్లోనే పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. అక్రమాలపై భారీ సంఖ్యలో ప్రజల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులే చెబుతున్నారు. Telangana Elections 2018 : Money and Liquor distribution is twice this time in Telangana Elections telangana elections, telangana elections 2018, telangana news, telangana, telangana assembly elections, telangana assembly elections 2018, telangana politics, telangana congress, తెలంగాణ ఎన్నికలు సర్వే, తెలంగాణ ఎన్నికలు భారీగా డబ్బు, మద్యం పంపిణీ,
    లిక్కర్ (ప్రతీకాత్మక చిత్రం)


    ఒకవేళ ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారికి రూ. 2వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఈ నెల 29 నుంచి జరగబోయే గోవా అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

    Rafale Deal, Goa CM Manohar Parrikar, Manohar Parrikar tweet on Rafale deal, Rahul Gandhi on Rafale deal, Rafale deal Audio tape, Goa Minister Audio Tape, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, మనోహర్ పారికర్ రాఫెల్ డీల్, రాఫెల్ డీల్3పై మనోహర్ పారికర్ ట్వీట్, రాహుల్ గాంధీ, గోవా మంత్రి ఆడియో టేప్, అరుణ్ జైట్లీ
    మనోహర్ పారికర్ (ఫైల్ ఫొటో)


    బాధ్యతా రాహిత్యంగా ఉన్న ప్రజలు, టూరిస్టుల మీద చర్యలు తీసుకోవాలని గోవా సీఎం మనోహర్ పారికర్ నిర్ణయించారు.
    First published:

    Tags: Goa, Liquor

    తదుపరి వార్తలు