Home /News /national /

రేప్ కేసులపై యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం...

రేప్ కేసులపై యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం...

యోగి ఆదిత్యనాథ్(File)

యోగి ఆదిత్యనాథ్(File)

మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల కేసులను విచారించేందుకు యూపీలో 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల కేసులను విచారించేందుకు యూపీలో 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఓ యువతి మీద అత్యాచారం చేసిన దుండగులు ఆమెను చంపేశారు. కేసు విచారణకు హాజరవుతున్న ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. తనను తాను కాపాడుకోవడానికి ఆ యువతి మంటలతోనే సుమారు కిలోమీటర్ దూరం వరకు పరిగెత్తింది. బాధితురాలిని ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం దక్కలేదు. నిందితులను హైదరాబాద్ దిశ హంతకుల తరహాలోనే ఎన్‌కౌంటర్ చేయాలని ఆమె చివరి కోరిక కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

    ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో జిల్లాకు మూడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అయితే, అందుకు తగిన కార్యాలయాలు, జడ్జిలు, న్యాయ ప్రక్రియకు కావలసిన ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయడం యోగి ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్. అసలే కోర్టుల్లో జడ్జిల సంఖ్య తక్కువగా ఉందనే వాదన ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Uttar pradesh, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు