హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : ఈవీఎం స్ట్రాంగ్​ రూం వద్దే మకాం వేసి..బైనాక్యులర్స్ ​తో ఎస్పీ అభ్యర్థి నిఘా

Video : ఈవీఎం స్ట్రాంగ్​ రూం వద్దే మకాం వేసి..బైనాక్యులర్స్ ​తో ఎస్పీ అభ్యర్థి నిఘా

ఎస్పీ అభ్యర్థి యోగేష్ వర్మ

ఎస్పీ అభ్యర్థి యోగేష్ వర్మ

SP Candidate Yogesh Verma : , ఈవీఎంలను దుర్వినియోగిస్తున్నారని, ట్యాంపరింగ్​ జరుగుతోందని ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఎన్నికల అభ్యర్థులకు ఇవి మరింత టెన్షన్​ పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోఉత్తర్​ప్రదేశ్​ లోని ఓ సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి టెన్షన్​ పడకుండా ఓ పెద్ద ప్లానే వేశారు.

ఇంకా చదవండి ...

SP Candidate Using Binoculars : దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. మొత్తం 403 శాసనసభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లో జరిగిన పోలింగ్​ ప్రక్రియ మార్చి-7న ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల తంతు ముగియడంతో 10వ తేదీన వెలువడే ఫలితాల కోసం పార్టీలు,నేతలు,ప్రజలందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సహజంగా ఎన్నికల్లో ఓటర్ల పని మంచి అభ్యర్థిని చూసి ఓటు వేయడం వరకే కానీ పార్టీలు, అభ్యర్థులకు మాత్రం ఎన్నికలంటే చాలా పనులు ఉంటాయి. ప్రచారం నుంచి ఫలితాలు వెలువడేంత వరకు అన్ని కష్టాలే. ఫలితాలు సమీపిస్తుంటే అప్పటి వరకు పక్కనే ఉన్న వాళ్లు జెండా ఎత్తేసి పక్క పార్టీల్లోకి జంప్ అవకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక, ఈవీఎంలను దుర్వినియోగిస్తున్నారని, ట్యాంపరింగ్​ జరుగుతోందని ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఎన్నికల అభ్యర్థులకు ఇవి మరింత టెన్షన్​ పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోఉత్తర్​ప్రదేశ్​ లోని ఓ సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి టెన్షన్​ పడకుండా ఓ పెద్ద ప్లానే వేశారు. బైనాక్యులర్స్ పెట్టుకుని ఈవీఎంలు పెట్టిన రూమ్​లపై స్వయంగా నిఘా పెడుతున్నారు

మీరట్ జిల్లాలోని హస్తినాపుర్ నియోజకవర్గం నుంచి ​ నుంచి పోటీ చేసిన సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి యోగేశ్​ వర్మ..ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్​ రూంపై బైనాక్యులర్స్ ​తో నిఘా పెడుతున్నారు. మద్దతుదారులతో కలిసి రోజంతా 24 గంటలపాటు స్ట్రాంగ్​రూంనే గమనిస్తున్నారు. దీని కోసం మూడు షిఫ్టులుగా విభజించుకొని ఒక్కొక్కరు 8 గంటలపాటు బైనాక్యూలర్స్​తో నిరంతరం స్ట్రాంగ్​రూం వద్ద పరిస్థితినే పరిశీలిస్తున్నారు. స్ట్రాంగ్​ రూం సమీపంలోనే మకాం వేశారు. ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరకుండా చూసేందుకే ఇలా చేస్తున్నట్లు యోగేశ్​ వర్మ చెప్పారు. తనకు అధికారులపై నమ్మకం ఉందని, కానీ ప్రజా తీర్పును పరిరక్షించేందుకు ఎలాంటి అవకాశాన్ని వదులుకోనని ఆయన చెబుతున్నారు.

ALSO READ Election Results 2022: కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఇక,బీజేపీనే విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ చెబుతున్న నేపథ్యంలో..యోగేశ్ మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. అవన్నీ తప్పుడు అంచనాలని అన్నారు. గతేడాది పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయని.. కానీ మమతా బెనర్జీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారని యోగేశ్​ వర్మ అన్నారు. యూపీ ఫలితాల చరిత్రను పరిశీలిస్తే హస్తినాపుర్ ఎమ్మెల్యే, సీఎం ఒకే పార్టీ నుంచి గెలుస్తూ వస్తున్నారని... ఈసారి కూడా అలాగే జరుగుతుందని యోగేశ్​ వర్మ తెలిపారు.


కాగా,2007లో బీఎస్పీ టికెట్​పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యోగేష్ వర్మ​... ఆ తర్వాత రెండుసార్లు పీస్​ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎస్పీ తరఫున పోటీచేశారు.

First published:

Tags: EVM, Samajwadi Party, UP Assembly Elections 2022

ఉత్తమ కథలు