హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP Accident: ఆవును తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు.. 13 మంది మృతి

UP Accident: ఆవును తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు.. 13 మంది మృతి

లారీ, బస్సు ఢీ

లారీ, బస్సు ఢీ

UP Bus accident: బస్సు బరాబంకీ సమీపంలోని బాబర్హియా సమీపంలోకి చేరుకోగానే ఓ ఆవు రోడ్డు మీదిక వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అతివేగంతో లారీ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమయింది.

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించబోయి.. ఎదురుగా వస్తున్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. గురువారం ఉదయం బారాబంకి (Barabanki) జిల్లా దేవ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబర్హియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండూ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి..సహాయక చర్యలుచేపట్టారు. గాయపడ్డవారిని  లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు.  ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు తెలిపారు.

Supreme Court : వైద్య విద్యా విధానం వ్యాపారంగా మారుతోంది : సుప్రీం కోర్టు

బస్సు ఢిల్లీ నుంచి బహ్రెయిచ్‌కు వెళుతోంది.  అది డబుల్ డెకర్ బస్సు. 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బరాబంకీ సమీపంలోని బాబర్హియా సమీపంలోకి చేరుకోగానే ఓ ఆవు రోడ్డు మీదిక వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అతివేగంతో లారీ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమయింది.  మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. గాయపడినవారిలో గోండా, బహ్రెయిచ్, బారాబంకి ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు.

అంగన్​వాడీ, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం గుడ్​న్యూస్​.. రూ. 50 లక్షల కరోనా బీమా

ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బారబంకీ అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, బాధిత ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీచేశారు.

First published:

Tags: Road accident, Uttar pradesh

ఉత్తమ కథలు