• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • UP POLICE SPECIAL TASK FORCE KILLED CLOSE ASSOCIATE OF CRIMINAL VIKAS DUBE SK

8 మంది పోలీసులను చంపిన వికాస్ దూబె అనుచరుడు ఎన్‌కౌంటర్

8 మంది పోలీసులను చంపిన వికాస్ దూబె అనుచరుడు ఎన్‌కౌంటర్

వికాస్ దూబెతో అమర్ దూబె

జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

 • Share this:
  యూపీలో 8 మంది పోలీసులను చంపిన రౌడీ షీటర్ వికాస్ దూబె గ్యాంగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం వికాస్ దూబె ప్రధాన అనుచరుడు అమర్ దూబెను ఎన్‌కౌంటర్ చేశారు. అమర్‌ కదలికలపై నిఘా పెట్టిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడు హమీర్‌పూర్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు. మౌదా ప్రాంతంలో అమర్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అమర్‌ దూబెను హతమార్చారు. ఈ విషయాన్ని యూపీ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అమర్‌పై రూ.25వేల రివార్డు ఉందని చెప్పారు.

  అటు వికాస్ దూబే మంగళవారం హర్యానాలోని ఫరీదాబాద్ హోటల్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు హోటల్‌పై పోలీసులు దాడి చేయగా.. అప్పటికే అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, గురుగ్రామ్‌ నగరాల పోలీసుల్ని సైతం యూపీ పోలీసులు అప్రమత్తం చేశారు. అంతేకాదు బిజ్‌నౌర్‌‌లో ఓ కారులో వికాస్‌ దూబే కనిపించినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిజ్నోర్‌ టౌన్‌ను అణువణువునూ గాలిస్తున్నారు. సరిహద్దున ఉన్న ఉత్తరాఖండ్ పోలీసుల్ని సైతం యూపీ పోలీసులు అప్రమత్తం చేశారు.

  జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వికాస్ దూబె‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి పైకప్పు నుంచి పోలీసులపైకి దాడి చేశారు. ఐతే కొందరు పోలీసులు వికాస్ దూబెకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో డిపార్ట్‌మెంట్‌లో వికాస్ దూబెకు అనుకూలంగా ఎవరు పనిచేస్తున్నారన్న దానిపైనా దృష్టిపెట్టారు పోలీసులు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు