హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ghar Wapsi: ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఘర్ వాపసీ ఉద్యమం.. హిందూ మతాన్ని తిరిగి స్వీకరించిన 18 మంది కుటుంబ సభ్యులు

Ghar Wapsi: ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఘర్ వాపసీ ఉద్యమం.. హిందూ మతాన్ని తిరిగి స్వీకరించిన 18 మంది కుటుంబ సభ్యులు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తన తండ్రి 12 ఏళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, ప్రస్తుతం తమ కుటుంబమంతా తిరిగి తమ మూలాల్లోకి వచ్చామని ఉమర్ కుమారుడు రషీద్ విలేకరులతో చెప్పాడు. తన తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించేటప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకునే వయస్సు తనకు లేదని, అయితే ఇకపై తాను ఇస్లాం పాటించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

ఇంకా చదవండి ...

హిందూ ధర్మం నుంచి వేరొక మతానికి మారినవారు మనదేశంలో ఎంతో మంది ఉన్నారు. మతం మార్చుకున్న ఇలాంటి వారిని తిరిగి తమ మూలాలకు రావాలని 'ఘర్ వాపసీ' అనే ఉద్యమానికి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘర్ వాపసీ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం హిందూ మతాన్ని తిరిగి స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లా కాండ్లా ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని 18 మంది తమ అసలు మతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబ సభ్యులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని తమ మూలాలకు తిరిగి వచ్చారు.

శాస్త్రోక్తంగా మతం మార్పు

తాము హిందుమతంలోకి వెళ్తున్నట్లు గత కొన్ని రోజుల క్రితమే ఈ కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అధికారికంగా మతాన్ని మార్చుకున్నారు. మహంతి యశ్వీర్ మహరాజ్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూజలు, హవన్(మతమార్పిడికి చెందిన హోమం) నిర్వహించారు.

కాండ్లాలోని రాయ్ జద్గన్ కాలనీలో ఉండే ఈ కుటుంబానికి పెద్ద ఉమర్. అతడు గతంలో ఇస్లాంను స్వీకరించాడు. అయితే తాజాగా తన భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్లు వారి పిల్లలతో కలిసి తన మాతృ మతానికి తిరిగి వచ్చాడు. తన తండ్రి 12 ఏళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, ప్రస్తుతం తమ కుటుంబమంతా తిరిగి తమ మూలాల్లోకి వచ్చామని ఉమర్ కుమారుడు రషీద్ విలేకరులతో చెప్పాడు. తన తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించేటప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకునే వయస్సు తనకు లేదని, అయితే ఇకపై తాను ఇస్లాం పాటించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

* ఉద్దేశపూర్వకంగానే మత మార్పిడి..

తమ అసలు మతానికి ఇష్టపూర్వకంగానే వచ్చినట్లు ఈ కుటుంబం స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే మతాన్ని మార్చుకుంటున్నామని, ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని ఉమర్, అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించి ఈ కుటుంబం గత వారం షామ్లీ తహసీల్‌లో అఫిడవిట్‌ను కూడా సమర్పించింది.

ఎప్పటి నుంచో ఉన్న ఈ ఘర్ వాపసీ ఉద్యమం.. భాజపా 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో బాగా ఊపందుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలవంతంగా మతం మార్చుకున్న చాలా మంది తిరిగి తమ సొంత మతానికి మారారు. ముఖ్యంగా క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన వారిని హిందూ, సిక్కు మతంలో చేరే అవకాశాన్ని ఈ ఉద్యమం ద్వారా కల్పించారు. తెలుగు రాష్ట్రాలతో సహా కేరళ, గోవాల్లో ఘర్ వాపసీ ద్వారా చాలామంది ప్రజలు తిరిగి సొంత మతంలో చేరారు.

First published:

Tags: National, Trending

ఉత్తమ కథలు