Home /News /national /

UP MINISTER FLEES FROM COURTROOM AFTER GUILTY VERDICT PVN

Minister flee : అక్రమ ఆయుధాల కేసులో దోషి అని తేలగానే కోర్టు రూమ్ నుంచి పరారైన మంత్రి!

Image credit : Rakesh Sachan twitter

Image credit : Rakesh Sachan twitter

 Minister Rakesh Sachan Flee : మూడు దశాబ్దాల నాటి అక్రమ ఆయుధాల కేసులో ఉత్తర ప్రదేశ్‭ మంత్రి రాకేష్ సచన్‌‌కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో మంత్రి రాకేశ్ సచన్‭ ని దోషిగా నిర్థారిస్తూ శనివారం కాన్పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక శిక్ష ఖరారుపై విచారణ జరగాల్సి ఉంది. నిందితులు దోషిగా తేలితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Minister Rakesh Sachan Flee : మూడు దశాబ్దాల నాటి అక్రమ ఆయుధాల కేసులో ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)‭ మంత్రి రాకేష్ సచన్‌‌కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో మంత్రి రాకేశ్ సచన్(Minister Rakesh Sachan)‭ ని దోషిగా నిర్థారిస్తూ శనివారం కాన్పూర్ కోర్టు(Kanpur Court) తీర్పు వెలువరించింది. ఇక శిక్ష ఖరారుపై విచారణ జరగాల్సి ఉంది. నిందితులు దోషి(Guilty)గా తేలితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాకేష్‌.. తీర్పు అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. రాకేష్ సచన్‌ను దోషిగా తేల్చిన తర్వాత కోర్టులో ప్రతివాది లాయర్ రిచా గుప్తా గరిష్ట శిక్ష విధించాలని అభ్యర్థించారు. మంత్రి తరఫున న్యాయవాదులు శిక్ష ఖరారు చేయడంపై వాదనల కోసం సమయం కోరారు. అయితే కోర్టు సమయం ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతలో జ్యుడిషియల్ అధికారులు ఛాంబర్‌కు వెళ్లారు. అయితే కోర్టు తీర్పుతో మంత్రి రాకేష్ సచన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. తీర్పు వెలువడగానే బెయిల్ బాండ్లను అందించకుండా కోర్టు నుంచి ఆయన పారిపోయారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. రాకేశ్ సచన్‌పై శనివారం రాత్రి కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాన్పూర్ జాయింట్ కమిషనర్‌ ఆనంద్ ప్రకాశ్ తివారీకి ఫిర్యాదు అందినట్టు తెలుస్తుంది. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని వెల్లడించారు.

అయితే తాను కోర్టు నుంచి పారిపోయాన్న ఆరోపణలను రాకేష్ సచన్ ఖండించారు. కోర్టు ఆవరణ నుంచి తాను పారిపోయాడన్న ఆరోపణలు కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తనపై ఇంకొన్న కేసులు పెండింగ్‭లో ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. "నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. నేను ఉదయం 11 గంటలకు కొంచెం ముందే కోర్టుకు చేరుకున్నాను. నాకు ఇతర కమిట్ మెంట్స్ ఉన్నందున కేసును వేగవంతం చేయమని అభ్యర్థించాను. లాయర్ సమయం పడుతుందని, మినహాయింపు కోసం దరఖాస్తు చేయమని అభ్యర్థించాను. ఆ తర్వాత నేను వెళ్లిపోయాను" అని ఆయన శనివారం విలేకరులతో అన్నారు. అయితే ప్రస్తుత తీర్పుపై ఆయనను ప్రశ్నించగా కోర్టు తీర్పును గౌరవిస్తానని రాకేశ్ పేర్కొన్నారు.Raksha Bandhan 2022: మీ సోదరుడికి ఇలా రాఖీ కట్టవద్దు,అలా చేస్తే అశుభం!

రాకేశ్ సచన్ గతంలో సమాజ్‭వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్‭పాల్ యాదవ్‭లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికమ ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి యోగి కేబినెట్ లో ప్రస్తుతం మధ్య, చిన్న, సూక్ష్మ సంస్థలు, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు. 1991లో రాకేష్ సచన్ దగ్గర అతని బంధువు రైఫిల్ దొరికింది. రాకేష్ అక్కడికక్కడే లైసెన్స్ చూపించలేకపోయారు. ఈ కేసులో పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. నౌబస్తా ఎస్‌వో బ్రిజ్‌మోహన్ ఉద్నియా ఆగస్ట్ 13, 1991న రాకేష్ సచన్‌పై కేసు పెట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Minister, Uttar pradesh

తదుపరి వార్తలు