• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • UP MAN GOES TO BUY GROCERIES AMID LOCKDOWN RETURNS WITH HIS BRIDE SK

తల్లి సరుకుల కోసం పంపిస్తే.. కోడలిని తీసుకొచ్చిన కొడుకు

తల్లి సరుకుల కోసం పంపిస్తే.. కోడలిని తీసుకొచ్చిన కొడుకు

ప్రతీకాత్మక చిత్రం

తల్లి సరుకులు తెమ్మని పంపిస్తే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఘజియాబాద్‌లోన తమ ఇంటి నుంచి భార్య ఉండే ఫ్లాట్‌కు కేవలం 30 కి.మీ. ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పాడు.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్ అమలులో పోలీసులు బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ కరోనాపై పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో యూపీలోని ఘజియాబాద్ పోలీసులకు విచిత్ర ఫిర్యాదు అందింది. ఓ మహిళ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొడుకుపై ఫిర్యాదు చేసింది. తాను సరుకులను తెమ్మని బయటకు పంపిస్తే.. కోడలిని తీసుకొచ్చాడని పేర్కొంది. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని తెలిపింది. ఎలాగైనా వారి వివాహాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్డు అనే 26 ఏళ్ల యువకుడు రెండు నెలల క్రితం హరిద్వార్‌లో సవిత అనే యువతిని పెళ్లాడు. సాక్షులు లేకపోవడంతో వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగైనా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాలని హరిద్వార్ వెళ్లాలనుకున్నాడు. కానీ లాక్‌డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భార్యను ఢిల్లీలోని ఓ అద్దెలో ఉంచి అప్పుడప్పుడూ వెళ్తొస్తుండేవాడు. ఐతే ఇటీవల ఇంటి ఓనర్ ఫ్లాట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో భార్యను బయటకు తీసుకొచ్చాడు. తల్లి సరుకులు తెమ్మని పంపిస్తే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఘజియాబాద్‌లోన తమ ఇంటి నుంచి భార్య ఉండే ఫ్లాట్‌కు కేవలం 30 కి.మీ. ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పాడు గుడ్డు. ఐతే వీరి పెళ్లిని అంగీకరించని గుడ్డు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: