uttar prasdeh : పచ్చి గుడ్లను తింటే.. చనిపోతారా.. అలా తిన్న వ్యక్తి ఏమయ్యాడు..?

uttar prasdeh : పచ్చి గుడ్లను తింటే.. చనిపోతారా.. అలా తిన్న వ్యక్తి ఏమయ్యాడు..?

ఫ్రతీకాత్మక చిత్రం

uttar prasdeh : పందెం పెట్టి ప్రాణాలకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు..రెండు వేల కోసం మొత్తం 50 గుడ్లు తింటానని బెట్టింగ్ కాశాడు. చివరకు తినలేక సోమ్మసిల్లి పడిపోయాడు.

  • Share this:


బెట్టింగ్‌లు సాధారణంగా సరదాగా కొనసాగుతాయి. పందెంలోకి గెలిచి వారు కొన్ని డబ్బులు సంపాదించడం కోసం అయితే మరికొన్ని శారీరక సామర్థ్యం నలుగురికి చూపించేందుకు కాస్తారు.. అయితే సరాదా కోసం కాసే పందాలు కొన్నిసార్లు విషమంగా మిగులుతున్నాయి. సరదా కోసం చేపట్టే పందాలు
ప్రాణంతకం అవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఇలాంటీ పందెమే ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తాను ఏదైన చేయగలననే పంతం తన ప్రాణం మీదకు తెచ్చింది. పందెం కోసం చివరివరకు ప్రయత్నం చేశాడు. కాని తన ప్రాణాలకు ఇబ్బంది కల్గుతుందనే ఆలోచన చేయలేకపోయాడు. అనాలోచిత నిర్ణయంతో తన ప్రాణాన్ని కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాష్ట్ర్రంలోని జాన్‌పూర్ ప్రాంతానికి చెందిన సుభాష్ యాదవ్ అనే వ్యక్తి మరోక వ్యక్తికి కోడిగుండ్ల పందెం పెట్టుకున్నారు. సుబాష్ యాదవ్ మొత్తం 50 కోడి గుండ్లు తింటే 2000 రూపాయాలు ఇస్తానని బెట్టింగ్ పెట్టాడు.

దీంతో సుభాష్ యాదవ్ అవలీలగా 41 గుడ్ల వరకు తిన్నాడు. అప్పటివరకు బాగానే ఉన్న సుబాష్ యాదవ్ 42 వ గుడ్డు తిన్న తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 40 గుడ్లు తిన్న కారణంగా అది
విషమించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పందెంపై విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా ..తన ఆజాగ్రత్త, అతి విశ్వాసంతో ప్రాణాన్ని పోగొట్టుకోవడం చర్చనీయంశంగా మారింది.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు