హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP Gangrape and murder: దళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య.. పెళ్లి చేసుకోవాలన్నందుకు గొంతు నులిమి చంపేశారు

UP Gangrape and murder: దళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య.. పెళ్లి చేసుకోవాలన్నందుకు గొంతు నులిమి చంపేశారు

లఖీంపూర్ రేప్ మర్డర్ కేసు నిందితులు

లఖీంపూర్ రేప్ మర్డర్ కేసు నిందితులు

Uttar Pradesh Gang Rape: లఖింపూర్ ఖేరీ పోలీసులు ఇవాళ ఉదయం మొదట జునైద్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కాల్పుల్లో అతడి కాలికి గాయమైంది. ఆ తర్వాత ఛోటూ, సోహైల్, హఫీజుల్, ఆరీఫ్, కరీముద్దీన్‌ను కూడా అరెస్ట్ చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తున్నా.. కోర్టులు ఉరిశిక్షలు వేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యూపీలోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Gang Rape) జిల్లాలో ఘోరం జరిగింది. నిఘసన్ కొత్వాలి ప్రాంతంలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై దుండుగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం కిరాతకంగా వారిని చంపేసి.. మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ గ్యాంగ్ రేప్ అండ్ డబుల్ మర్డర్ (UP Gang rape and Double Murder) కేసు యూపీలో దుమారం రేపుతోంది. పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.

  గురువారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ కీలక విషయాలను వెల్లడించారు. అరెస్టయిన ఆరుగురు నిందితులంతా స్నేహితులని తెలిపారు. మృతుల ఇంటి పక్కన నివసించే ఛోటూ ద్వారా మిగతా నిందితులకు బాలికలతో పరిచయం ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం ఛోటూతో పాటు జునైద్, సోహైల్.. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిపై ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకు ముందు కూడా.. వీరితో బలవంతంగా శారీరక సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇటీవలే వారిద్దరు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ పెళ్లి చేసుకోవడం నిందితులకు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేశారు. ఛోటూ, జునైద్, సోహైల్ వారిని గొంతు నులిమి చంపేయగా... చెట్టుకు ఉరివేసేందుకు మరో ముగ్గురు స్నేహితులు హఫీజుల్, ఆరీఫ్, కరీముద్దీన్ సహకరించారు.

  ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న లఖింపూర్ ఖేరీ పోలీసులు ఇవాళ ఉదయం మొదట జునైద్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కాల్పుల్లో అతడి కాలికి గాయమైంది. ఆ తర్వాత ఛోటూ, సోహైల్, హఫీజుల్, ఆరీఫ్, కరీముద్దీన్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారిపై అత్యాచారం, హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మృతుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిని గొంతు నులిమి చంపేసినట్లుగా పోస్టుమార్టంలో తేలింది. బాలికల మృతదేహాలను వారి స్వగ్రామం తమోలి పూర్వాకు తరలించారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు మృతురాల గ్రామానికి వెళ్లి.. తల్లిదండ్రులను పర్యవేక్షించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు. రాబోయే తరాలు గుర్తించుకునేలా కఠినంగా శిక్షిస్తామని... మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Gang rape, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు