సమోసాలు అమ్ముకునే వ్యక్తికి ఇంత ఆదాయమా..? షాక్ తిన్న అధికారులు..

UP Kachori Seller Earns Over 60 Lakh : ఒక సమోసా-కచోరీ వ్యాపారి ఇంత సంపాదిస్తున్నాడా? అని మొదట కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా నమ్మలేకపోయారు.కానీ ఓరోజు వారే స్వయంగా అక్కడికి వెళ్లారు. సమీపంలోని మరో షాప్‌లో కూర్చొని ముఖేష్ షాప్‌ ముందున్న క్యూ లైన్‌ను, రోజంతా జరిగిన కొనుగోళ్లను గమనించారు.

news18-telugu
Updated: June 25, 2019, 3:13 PM IST
సమోసాలు అమ్ముకునే వ్యక్తికి ఇంత ఆదాయమా..? షాక్ తిన్న అధికారులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీఘర్ ప్రాంతంలో ఉన్న సీమా సినిమా థియేటర్ ప్రాంతం. థియేటర్ పక్కనే ముఖేష్ అనే చిరు వ్యాపారి నిర్వహిస్తున్న చిన్న సమోసా-కచోరీ షాప్. షాప్ చిన్నదే కానీ.. థియేటర్ ముందు కూడా లేనంత క్యూ లైన్ ఇక్కడ ఉంటుంది. ఆ షాప్‌లో దొరికే సమోసా-కచోరీకి లోకల్‌గా అంత పాపులారిటీ ఉంది. ఎంత పాపులారిటీ అంటే.. ఏడాదికి రూ.60లక్షలు నుంచి రూ.1కోటి సంపాదించేంత. నమ్మాలనిపించడం లేదు కదా.. కానీ ఇది నిజం. ముఖేష్ సంపాదన అంచనా వేసి.. ఇటీవలే ఎవరో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌వాళ్లకు ఫిర్యాదు కూడా చేశారు.

ఒక సమోసా-కచోరీ వ్యాపారి ఇంత సంపాదిస్తున్నాడా? అని మొదట కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా నమ్మలేకపోయారు.కానీ ఓరోజు వారే స్వయంగా అక్కడికి వెళ్లారు. సమీపంలోని మరో షాప్‌లో కూర్చొని ముఖేష్ షాప్‌ ముందున్న క్యూ లైన్‌ను, రోజంతా జరిగిన కొనుగోళ్లను గమనించారు. అక్కడి సీన్ చూశాక.. ముఖేష్ ఆదాయం ఎంత లేదన్నా ఏడాదికి రూ.60లక్షలు నుంచి రూ.1కోటి ఉంటుందని అంచనా వేశారు.అప్పటికప్పుడు ముఖేష్‌కు నోటీసులు జారీ చేసి ట్యాక్స్ కట్టాలని చెప్పారు. జీఎస్టీ కింద షాప్‌ను రిజిస్టర్ చేయించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై స్పందించిన స్టేట్ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్.. ముఖేష్ తన ఆదాయానికి సంబంధించిన వివరాలన్నింటిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడని తెలిపారు.

రూ.40లక్షలు ఆదాయ పరిమితి దాటిన ఎవరైనా సరే జీఎస్టీ కింద రిజిస్టర్ చేయించుకోవాలని అన్నారు. ముఖేష్ కూడా జీఎస్టీ కింద షాప్‌ను రిజిస్టర్ చేయించుకుని ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు.మరోవైపు ముఖేష్ మాత్రం.. తాను 12ఏళ్లుగా షాప్ నడుపుతున్నా..ఇలాంటి నోటీసులు ఎప్పుడు అందుకోలేదని చెబుతున్నారు.తానో సాధారణ చిరు వ్యాపారిని అని.. బతుకుదెరువు కోసం కచోరీలు, సమోసాలు అమ్ముకుంటున్నానని తెలిపాడు.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>