Yogi adityanath interview : ఈ నెల 10,12 తేదీల మధ్య యూపీ రాజధాని లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(UPGIS-2023)జరుగనుంది. ఇటువంటి కీలక సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2023)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి(Rahul joshi)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్(UttarPradesh) అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎలాంటి బ్లూప్రింట్ కలిగి ఉన్నారు, అభివృద్ధి రేసులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆవిర్భవిస్తారా, ‘మిషన్ 2024’ కోసం సీఎం యోగి వ్యూహం ఏమిటి అనే కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఇంటర్వ్యూలో సీఎం సమాధానమిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూలో అన్నారు. ఉత్తరప్రదేశ్ వ్యాపారానికి సురక్షితమైనదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత శాంతిభద్రతలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంపై ఉన్న అవగాహనను మార్చాయి అని సీఎం తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, రాజకీయ, ఆర్థిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు మరియు పరిశ్రమ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా వ్యాపార నెట్‌వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూపీజీఐఎస్ 2023 ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ సంవత్సరం యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ చారిత్రాత్మకమైనదన్నారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే లక్ష్యాన్ని సాధించాలనుకుంటుందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ లక్ష్యంలో పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ నెట్‌వర్క్ 18 ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఉత్తర ప్రదేశ్ వృద్ధి రేటు 13 నుండి 14 శాతం మధ్య ఉందన్నారు. కోవిడ్ సవాలును యూపీ ఎదుర్కొంటూనే రాష్ట్రంలో GDP,తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు.
Ayodhya : అయోధ్యలో ఆ శిలలను చెక్కకూడదా? ఉలి వాడితే వినాశనం తప్పదా?
కాగా,UPGIS-2023కి ముందు పెట్టుబడులను ఆకర్షించేందుకు 2022 డిసెంబర్‌లో 16 దేశాల్లోని 21 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎనిమిది బృందాలను పంపారు. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు యుపి ప్రభుత్వం రాష్ట్రం, దేశం మరియు ప్రపంచం నుండి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. మీడియా నివేదికల ప్రకారం, ప్రధాన ఈవెంట్‌కు ముందే, యుపి ప్రభుత్వానికి 20 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు యూపీ విద్యాశాఖకు రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయని సీఎం ఆదిత్యనాథ్ శనివారం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Up news, Uttar pradesh, Yogi adityanath