Home /News /national /

UP HATHRAS SHOOTING INCIDENT OUT ON BAIL MAN ACCUSED OF SEX ASSAULT KILLS WOMANS FATHER IN UTTAR PRADESH NK

ఉత్తరప్రదేశ్... హత్రాస్‌లో దారుణం... రేప్ కేసులో బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన నిందితుడు

ఉత్తప్రదేశ్... హత్రాస్‌లో దారుణం... రేప్ కేసులో బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన నిందితుడు (File)

ఉత్తప్రదేశ్... హత్రాస్‌లో దారుణం... రేప్ కేసులో బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన నిందితుడు (File)

సంచలన హత్రాస్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. రేప్ కేసులో బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దేశం ఎటుపోతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ రేప్ కేసును ఇప్పటికీ ప్రజల మనసులో ఓ దారుణంగా ముద్ర వేసుకొనే ఉంది. దానికి కొనసాగింపు తాజాగా జరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి... 2018లో జైలు కెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా అతడు ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో... ఉత్తరప్రదేశ్... హత్రాస్ జిల్లాలో... బాధితురాలి తండ్రిని కాల్చి చంపినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం 4.30కి గ్రామానికి అవతల ఉన్న ఆలయం దగ్గర బాధిత కుటుంబం, నిందితుడి కుటుంబం మధ్య గొడవ జరిగిందనీ... అందులో భాగంగానే కాల్పులు జరపడంతో... బాధితురాలి తండ్రికి బుల్లెట్లు దూసుకెళ్లగా... ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... ఆయన మరణించారని హత్రాస్ పోలీసులు తెలిపారు.

    సోషల్ మీడియాలో వివరణాత్మక స్టేట్‌మెంట్ పెట్టిన పోలీసులు... అత్యాచారం కేసులో బాధితురాలి ఫిర్యాదు చేయడంతో... నిందితుడు గౌరవ్ శర్మ... 2018లో ఓ నెల పాటూ జైల్లో ఉన్నట్లు తెలిపారు. నెల తర్వాత స్థానిక కోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి అతను బయటే ఉన్నాడని వివరించారు.

    "ఆ రెండు కుటుంబాలకూ అప్పటి నుంచి వివాదం ఉంది. తాజాగా నిందితుడి భార్య, ఆంటీ... ప్రార్థనల కోసం ఆలయానికి వెళ్లారు. అక్కడే మృతుడి ఇద్దరు కూతుర్లూ ఉన్నారు. అక్కడ వారి మధ్య గొడవ జరగగా... నిందితుడు, బాధితురాలి తండ్రి మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరిగింది. నిందితుడు పరుగున వెళ్లి... తన కుటుంబానికి చెందిన కొంత మంది కుర్రాళ్లను తీసుకొచ్చి... కాల్చి చంపాడు" అని హత్రాస్ పోలీస్ స్టేషన్ చీఫ్ వినీత్ జైశ్వాల్... ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో స్టేట్‌మెంట్‌లో తెలిపారు.


    నిందితుడు గౌరవ్ శర్మ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అధికారులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం... ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కఠిన శిక్షలు పడాలన్నారు. దీనిపై స్థానిక జర్నలిస్టులు కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.


    "మాకు న్యాయం చెయ్యండి. అతను నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు నా తండ్రిని కాల్చి చంపాడు. అతను మా గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేడుగురు ఉన్నారు. నా తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. అతని వేరు గౌరవ్ శర్మ అని బాధితురాలు" పోలీస్ స్టేషన్ ముందు కన్నీరు పెట్టింది.




    ఇది కూడా చదవండి: మహిళపై పాల డెలివరీ బాయ్ లైంగిక వేధింపులు.. కేసు దర్యాప్తులో పోలీసులకు ట్విస్ట్

    అసలు గౌరవ్ శర్మకు అప్పుడే శిక్ష విధించి, అమలు చేసి ఉంటే... ఈనాడు ఈ మరణం సంభవించేదే కాదని స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Hathras S24p16, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు