హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

యోగీ సర్కార్ ‘లవ్ జీహాద్’ ఆర్డినెన్స్ పై సుప్రీంలో పిటిషన్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

యోగీ సర్కార్ ‘లవ్ జీహాద్’ ఆర్డినెన్స్ పై సుప్రీంలో పిటిషన్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలను పాటించని వారికి భారీ జరిమానాలు కూడా తప్పవని సీఎం హెచ్చరించారు.

శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలను పాటించని వారికి భారీ జరిమానాలు కూడా తప్పవని సీఎం హెచ్చరించారు.

Love Jihad: ఇటీవల యూపీలోని యోగీ ఆదిత్యానాథ్(Yogi Adithyanath) సర్కార్ ‘లవ్ జీహాద్’ పేరిట సంచలన ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద అక్కడ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. లవ్ జీహాద్ ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

ఇంకా చదవండి ...

  ఇటీవల యూపీలోని యోగీ ఆదిత్యానాథ్ సర్కార్ ‘లవ్ జీహాద్’ పేరిట సంచలన ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద అక్కడ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మరో వైపు ఈ చట్టంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లవ్ జీహాద్ ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కొంత మంది లా విద్యార్థులు ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ఏకపక్షమని వారు పిటీషన్లో పేర్కొన్నారు. మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుగా మారుతాయన్న అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసకుంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  ఇదిలా ఉంటే.. బలవంతపు మత మార్పిడులకు అడ్డుకునేందుకే ఈ మేరకు చట్టం తీసుకువస్తున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు ఆర్డినెన్స్ తీసుకువచ్చిన సమయంలో తెలిపాయి. యూపీ మంత్రి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఒకరు బలవంతపు మతమార్పిడికి పాల్పడినట్లు తేలితే వారికి 1-5 ఏళ్ల జైలు శిక్షతో ఉంటుందని తెలిపారు. జైలు శిక్షతో పాటుగా రూ.15 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

  ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలు, మైనార్టీలు మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి పదేళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారని వెల్లడించారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకు వస్తామని గత నెలలో జౌన్‌పూర్ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Love, Supreme Court, Uttar pradesh, Yogi adityanath

  ఉత్తమ కథలు