హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ayodhya Verdict : యూపీ సర్కార్ కీలక నిర్ణయం... అయోధ్యకు ఐఏఎస్‌ల బదిలీ

Ayodhya Verdict : యూపీ సర్కార్ కీలక నిర్ణయం... అయోధ్యకు ఐఏఎస్‌ల బదిలీ

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

Ayodhya Verdict : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే... అయోధ్య ఆ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి. అందువల్ల అక్కడి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

Ayodhya Verdict : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుందో, దాని తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయోనని రకరకాలుగా ఆలోచిస్తూ... ఉక్కిరిబిక్కిరవుతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకైనా మంచిదని మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ మహేంద్ర ప్రసాద్‌ అగర్వాల్‌ను అయోధ్య సర్కిల్‌కి స్పెషల్ ఆఫీసర్‌గా వేసింది. అంతేకాదు... ఐదుగురు ఐఏఎస్ అధికారులను అయోధ్యకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ ఐదుగురిలో ఒకరు అయోధ్యకు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు మహేంద్ర ప్రసాద్ అగర్వాల్... అయోధ్య సర్కిల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇలా ఇంత మందిని మోహరించడం ద్వారా... అయోధ్యలో ఎలాంటి అపశ్రుతులూ జరగకుండా జాగ్రత్త పడుతోంది యూపీ సర్కార్.

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆ ఒక్క రాష్ట్రానికే 4వేల పారా మిలిటరీ దళాల్ని తరలించారు. అలాగే... 30 బాంబు స్క్వాడ్ బృందాలు కూడా వెళ్లాయి. ఎందుకైనా మంచిదని ఉత్తరప్రదేశ్‌లో స్కూళ్లకు మూడు రోజులు (సోమవారం వరకు) సెలవులు కూడా ఇచ్చారు.


Pics : బెంగాలీ రసగుల్ల మేఘా చౌదరీ క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :

Ayodhya Verdict : రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలు

Ayodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?

RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

First published:

Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు