మహా కుంభమేళాను విజయవంతంగా ముగించబోతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమంపై ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఐతే... మార్చి 4న ముగియబోయే ఈ క్రతువుకి అదనపు టచ్ ఇస్తూ... గిన్నీస్ బుక్ రికార్డ్ ప్రయత్నం చెయ్యబోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ కొత్త రికార్డు కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 500 బస్సుల్ని సిద్ధం చేసింది. అన్నింటిపైనా కుంభమేళా లోగో ఏర్పాటు చేసింది. ఈ బస్సులన్నీ ఒకదాని వెంట ఒకటిగా వెళ్లబోతున్నాయి. తద్వారా ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది.

కుంభమేళా బస్సులు (Image : Twitter)

కుంభమేళా బస్సులు (Image : Twitter)
ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

కుంభమేళా బస్సులు (Image : Twitter)
జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4న మహా శివరాత్రితో ముగియనుంది. పవిత్ర గంగానది వెంట 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. అలాగే భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులకు వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు తీయడాన్ని అధికారులు నిషేధించారు. తద్వారా ఈసారి కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి :