హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Development: లక్షల కోట్ల పెట్టుబడులు! మోదీ మార్క్‌ రూలింగ్‌! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అంబానీ వరాల వర్షం

Development: లక్షల కోట్ల పెట్టుబడులు! మోదీ మార్క్‌ రూలింగ్‌! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అంబానీ వరాల వర్షం

మోదీ, యోగి (Image Credit yogi adityanath Twitter)

మోదీ, యోగి (Image Credit yogi adityanath Twitter)

Development: యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడుల సదస్సు ఇది. ఈ సమ్మిట్‌తో యూపీలో 29.92 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం అయింది. దీని కారణంగా 92.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించుకునే అవకాశం దక్కింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మోదీ మార్క్‌ రూలింగ్‌తో అదరగొడుతున్నారు. దేశంలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్న నరేంద్రుడు.. ఇప్పుడు పెట్టుబడులపై ఫుల్‌గా పోకస్‌ పెంచారు. ఇవాళ్టి న ఉంచి మూడు రోజుల పాటు లక్నోలో జరగుతున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు ముఖ్య అతిధి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడుల సదస్సు ఇది. ఈ సమ్మిట్‌తో యూపీలో 29.92 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం అయింది. దీని కారణంగా 92.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించుకునే అవకాశం దక్కింది.

టార్గెట్‌ 5 ట్రిలియన్ డాలర్లు:

భారత ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల శక్తిగా తీర్చిదిద్దాలనేది మోదీ ఆలోచన. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా అంటే కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇదే రేంజ్‌లో ప్రతిరాష్ట్రానికి పెట్టుబడులు వస్తే.. మరో ఐదేళ్లతో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతాం అంటున్నారు నిపుణులు. ఇక యూపీని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, ఇది దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పాన్ని నెరవేరుస్తుందని ప్రధాని కూడా ఈ సమ్మిట్‌లో అభిప్రాయపడ్డారు.

అభివృద్ధికి ముఖ ద్వారం:

లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యూపీ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి ముఖ ద్వారంగా అభివర్ణించిన యోగి.. యూపీలో పెట్టుబడుల కోసం 18,643 ఎంఓయూ(MOU)లపై సంతకాలు జరిగాయని చెప్పారు.

రూ.75,000 కోట్లు పెట్టుబడి ప్రకటించిన అంబానీ:

యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఉత్తరప్రదేశ్‌పై వరాల వర్షం కురిపించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు, అదనంగా రూ.75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు.  జియో, రీటైల్‌, రెన్యూవల్‌, రంగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అంబానీ ప్రకటించారు ఈ మెగా పెట్టుబడుల నిర్ణయం ద్వారా రానున్న కాలంలో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది.    యూపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ , యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

First published:

Tags: Narendra modi, Yogi adityanath

ఉత్తమ కథలు