హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏడాదిన్నరగా ఇంట్లోనే కొడుకు మృతదేహం... కుళ్లిన శవంపై రోజూ గంగాజలం జల్లుతున్న తల్లి

ఏడాదిన్నరగా ఇంట్లోనే కొడుకు మృతదేహం... కుళ్లిన శవంపై రోజూ గంగాజలం జల్లుతున్న తల్లి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శుక్రవారం ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. అక్కడ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కమలేష్ మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. కమలేష్ చనిపోయాడని చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు. అతడు కోమాలో ఉన్నాడని.. ఎప్పటికైనా మళ్లీ కోలుకుంటానని చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆయన ఆదాయ పన్నుశాఖలో ఉద్యోగి. కరోనా వల్ల మరణించాడు. కానీ ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో ఉన్నారు. అందుకే ఏడాదిన్నరగా ఆయన మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. కుళ్లిపోయి కంపు కొడుతున్నా నమ్మలేదు. ప్రతి రోజూ శవంపై గంగా జలం చల్లేవారు. కోమాలో ఉన్నట్లు భావించి.. ప్రతిరోజూ ఆక్సిజన్ కూడా పెట్టేవారు. యూపీ (Uttar Pradesh) లోని కాన్పూర్‌ (Kanpur)లో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

  Rajanna Siricilla: మితిమీరిన వేగంతో పత్తి పొలంలోకి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  కాన్పూర్‌లోని రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివపురి ప్రాంతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రిటైర్డ్ ఉద్యోగి రామ్ ఫ్యామిలీ నివసిస్తోంది. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన విమలేష్ (35) ఆదాయ పన్ను శాఖ (Income Tax Department)లో ఉద్యోగం చేసేవాడు. ఐతే 2021 ఏప్రిల్‌లో అతడికి కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో అదే నెలలో 22వ తేదీన మరణించాడు. కోవిడ్ నిబంధనను పట్టించుకోకుండా ఆసుపత్రి యాజమాన్యం విమలేష్ మృతదేహాన్ని మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు బంధువులకు అప్పగించింది. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. విమలేష్ గుండె చప్పుడు వస్తోందని తల్లి రామ్ దులారి అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. అప్పటి నుంచి అతని మృతదేహాన్ని ఇంట్లోని ఓ గదిలో ఉంచి తల్లిదండ్రులు సంరక్షిస్తున్నారు. విమలేష్ భార్య మితాలీతో పాటు విమలేష్ సోదరులు సునీల్, దినేష్ కుటుంబం కూడా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. విమలేశ్ బాడీ కుళ్లిపోయినా..  వారంతా అతడు బతికే ఉన్నాడన్న భ్రమలోనే ఇంకా ఉన్నారు. ప్రతి రోజూ అతడిపై గంగాజల చల్లి.. ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టేవారు.

  ఐతే వారం రోజుల క్రితం విమలేష్ భార్య మితాలీ అహ్మదాబాద్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో తన భర్త మరణం గురించి తెలియజేసింది. తన భర్త చనిపోయాడని, అయినప్పటికీ అతడి తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుతున్నారని వెల్లడించింది. దీనిపై కాన్పూర్‌ సిఎంఒ, జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసిన ఆదాయపన్నుశాఖ దర్యాప్తు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. అక్కడ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కమలేష్ మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. కమలేష్ చనిపోయాడని చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు. అతడు కోమాలో ఉన్నాడని.. ఎప్పటికైనా మళ్లీ కోలుకుంటానని చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో.. తమ కుమారుడు లేడన్న విషయాన్ని తెలుసుకొని.. కంటతడి పెట్టారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు