• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • UP CM YOGI ADITYANATH MEETS FAMILIES OF DECEASED COPS ANNOUNCES RS 1 CRORE COMPENSATION SK

రౌడీల కాల్పుల్లో మరణించిన పోలీసు కుటుంబాలకు రూ.కోటి పరిహారం: యోగి

రౌడీల కాల్పుల్లో మరణించిన పోలీసు కుటుంబాలకు రూ.కోటి పరిహారం: యోగి

యోగి ఆదిత్యనాథ్

పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరిరి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం యోగి. పోలీసు అమరవీరుల త్యాగాలు వృథా కావని అన్నారు.

 • Share this:
  రౌడీల కాల్పుల్లో మరణించిన పోలీస్ కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలు వృథా కావని అన్నారు. శుక్రవారం సాయంత్రం కాన్పూర్‌కు వెళ్లిన ఆయన.. పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు యూపీ సీఎం. అటు దుండుగుల కాల్పుల్లో గాయపడిన పోలీసులను రీజెన్సీ ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

  శుక్రవారం ఉదయం.. కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఇంటి పైకప్పు నుంచి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల ముఠాలో 8 మంది వరకు ఉంటారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూపీలో గూండారాజ్ నడుస్తోందనటానికి ఈ దాడే ఉదాహరణ అని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు