Home /News /national /

UP CM YOGI ADITYANATH EATS LUNCH AT DALIT FAMILY VRY

UP elections : దళితుడి ఇంట్లో సీఎం భోజనం.. పండగకు పిలిచినందుకు ధన్యవాదాలు..అంటూ..

దళితులతో కలిసి భోజనం చేస్తున్న సీఎ యోగి అధిత్యనాథ్

దళితులతో కలిసి భోజనం చేస్తున్న సీఎ యోగి అధిత్యనాథ్

UP elections : యూపీ ఎన్నికల నేపథ్యంలోనే ఆ రాష్ట్ర సీఎం ఓ దళితుడి ఇంటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. తనను పండగ సంధర్భంగా ఆహ్వానించినందుకు ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఎన్నికల ప్రచార వేడి అప్పుడే మొదలు పెట్టి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో అప్పుడే అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. తిరిగి అధికారం సాధించడం కోసం అధికార బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యానాథ్ సంక్రాంతి పండగ సంధర్భంగా ఓ దళితుడి ఇంటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు.

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీజేపీని ఢీకొట్టేందుకు సమాజ్ వాదీ పార్టీ రెడీ అయిపోయింది. బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీ పార్టీ వైపు వెళ్లిపోయారు. అయినా…బీజేపీ ఏ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారాన్ని ముమ్మరం చేపట్టారు.





    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అటు చిరంజీవిని ఇటు జూ.ఎన్టీఆర్‌ను సైతం వదల్లేదు...!

    Khammam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సౌత్ ఇండియా హెడ్‌.. అయినా ఆ ఉద్యోగాన్ని వదిలాడు.. ఎందుకంటే

    నేడు మకర సంక్రాంతి సంధర్భంగా ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంటికి వెళ్లారు. వెళ్లడమే కాకుండా కుటుంబ పెద్దతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మకర సంక్రాంతి సందర్భంగా…తనను ఆహ్వానించి… భోజనం పెట్టినందుకు షెడ్యూల్ కులాల కమ్యూనిటీకి చెందిన వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ పార్టీలు ఓబీసీ ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తున్నారు. ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. ఓబీసీలలోనే మరింత వెనుకబడిన వర్గమైన నోనియా కులం తూర్పు యూపీ జనాభాలో మూడు శాతం ఉంటుంది. వీరి ఓట్లు కూడా బీజేపీకి అవసరం. ప్రస్తుతం వీరిని ఆకట్టుకొనే పనిలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన మంత్రి వర్గం నుండే ముగ్గురు మంత్రులు వెళ్లడం సంచలనంగా మారింది. దీంతో ప్రస్తుతం బీజేపీకి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సొంత పార్టీల నేతలు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీని వీడి ప్రతిపక్ష ఎస్పీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: National News, UP Assembly Elections 2022

    తదుపరి వార్తలు