Home /News /national /

UP ASSEMBLY POLLS 2022 LIKELY TO BE IN 7 OR 8 PHASES EC SCHEDULE EXPECTED AFTER JAN 5 SAYS REPORTS MKS

UP Assembly polls 2022 : 7-8 విడతల్లో యూపీ ఎన్నికలు.. 5న ఈసీ పోల్ షెడ్యూల్?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జనవరి 5న వెలువడే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 7 నుంచి 8 విడతల్లో పోలింగ్ ఉండవచ్చని ఈసీ వర్గాల సమాచారం. ఎన్నికల సన్నద్థతను పరిశీలించేందుకు సీఈసీ సుశీల్ చంద్ర బుధవారం పంజాబ్ లో పర్యటించారు. వివరాలివే..

ఇంకా చదవండి ...
కేంద్రంలో అధికార కైవసానికి అతి కీలకమైన రాష్ట్రం, దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జనవరి 5న వెలువడే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని రిపోర్టులు వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి మార్చి మొదటివారం నాటికి పూర్తి చేయాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో 7 నుంచి 8 విడతల్లో పోలింగ్ ఉండవచ్చని ఈసీ వర్గాల సమాచారం. 2022 మార్చి నుంచి మే వరకు యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈసీ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

యూపీలో అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సీజన్ వచ్చేసినట్లుగా వాతావరణం మారిపోయింది. మరోవైపు ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో లాంఛనంగా పర్యటనలు మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌‌ అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంసిద్ధతను సమీక్షిచేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర బుధవారంనాడు పంజాబ్‌లో పర్యటించారు.

Aadhaar Linked Voter IDs : మోదీ సర్కార్ సంచలనం -ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ సహా కేబినెట్ నిర్ణయాలివే..



సీఈసీ పంజాబ్ పర్యటన తర్వాత వచ్చే వారంలో గోవాలోనూ, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లోనూ ఈసీ టీమ్ పర్యటించనుంది. ఆయా పర్యటనల్లో రాష్ట్ర అధికారులు, భాగస్వాములతో కలిసి ఎన్నికల సంసిద్ధత, అక్కడి పరిస్థితిని ఈసీ టీమ్ అంచనా వేస్తుంది. ఓటర్ల జాబితా అప్‌డేషన్, కోవిడ్-ప్రోటోకాల్స్, తదితర అంశాలను ఈ బృందం పరిగణనలోకి తీసుకుంటుంది. తమ పర్యటనల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశమవుతుంది. ఇదిలా ఉంటే,

kenya giraffes: భగవంతుడా.. బతుకెందుకిచ్చావ్? త్వరలో మనుషులకూ ఇలాంటి దుస్థితేనా!!


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు మొదలుపెట్టగా, అదే ఈసీ పంపిన ఎన్నికల సంస్కరణలు కొన్నింటికి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిసింది. ఈ మేరకు రూపొందించిన బిల్లులో కీలక అంశాలున్నాయి. ఓటరు కార్డుకు ఆధార్ ను అనుసంధానించడం, ఇకపై ఏడాదికి నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడం, మహిళా సర్వీసు ఓటర్ల భర్తలకూ పోస్టల్ బ్యాలెట్ హక్కు కల్పించడం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తరిస్తూ, మరిన్ని అధికారాలు కట్టబెట్టడం ఆ బిల్లులో ప్రధానాంశాలుగా ఉన్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: 5 State Elections, Election Commission of India, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు