హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pushpa: యూపీ ఎన్నికల్లో 'పుష్ప' హవా.. ఎక్కడ చూసినా ఆ పాటే.. వైరల్ వీడియో

Pushpa: యూపీ ఎన్నికల్లో 'పుష్ప' హవా.. ఎక్కడ చూసినా ఆ పాటే.. వైరల్ వీడియో

UP Elections | Pushpa Song: యూపీ ఎన్నికల్లోనూ పుష్ప పాట రచ్చ చేస్తోంది.  శ్రీవల్లి పాట ట్యూన్‌తో కాంగ్రెస్ పార్టీ తమ ఎలక్షన్ సాంగ్‌ను విడుదల చేసింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది.

UP Elections | Pushpa Song: యూపీ ఎన్నికల్లోనూ పుష్ప పాట రచ్చ చేస్తోంది. శ్రీవల్లి పాట ట్యూన్‌తో కాంగ్రెస్ పార్టీ తమ ఎలక్షన్ సాంగ్‌ను విడుదల చేసింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది.

UP Elections | Pushpa Song: యూపీ ఎన్నికల్లోనూ పుష్ప పాట రచ్చ చేస్తోంది. శ్రీవల్లి పాట ట్యూన్‌తో కాంగ్రెస్ పార్టీ తమ ఎలక్షన్ సాంగ్‌ను విడుదల చేసింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది.

  గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప మూవీ (Pushpa Movie) ఎన్నో సంచలనాలు సృష్టించింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో సూపర్ హిట్ కావడం ఓకే. కానీ హిందీ బెల్ట్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. రికార్డుల మోత మోగించింది. అక్కడ రూ.100 కోట్లపైగా వసూళ్లు సాధించి.. తగ్గేదేలే.. అని మీసం మెలేసింది. తెలుగు సినిమా సత్తాను చాటింది. అంతేకాదు పుష్ప పాటలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్.. ఇలా ఏ షార్ట్ వీడియో యాప్ ఓపెన్ చేసినా పుష్ప పాటలే సందడి చేస్తున్నాయి. క్రికెటర్లు కూడా వీటికి స్టెప్పులేస్తున్నారు. అంతేకాదు క్రికెట్ మ్యాచ్‌ల్లో సిక్స్‌లు కొట్టినా.. వికెట్ పడగొట్టినా.. పుష్ప స్టైల్‌ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఆటగాళ్లు. అంతలా పుష్ప ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఐతే తాజాగా యూపీ ఎన్నికల్లోనూ పుష్ప పాట రచ్చ చేస్తోంది. శ్రీవల్లి పాట ట్యూన్‌తో కాంగ్రెస్ పార్టీ తమ ఎలక్షన్ సాంగ్‌ను విడుదల చేసింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది.

  Narendra Modi: వ్యాపారవేత్తలకు మద్దతుగా ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్

  యూపీ అసెంబ్లీ ఎన్నికల (UP Assembly Elections) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల తమ ఎన్నికల పాటను విడుదల చేసింది. తూ హే గజబ్ యూపీ.. తేరీ కసమ్ యూపీ.. అంటూ సాగే ఈ పాట.. పుష్ప మూవీలోని శ్రీవల్లి ట్యూన్‌లో వినిపిస్తోంది. శ్రీవల్లి పాట ట్యూన్‌తోనే కాంగ్రెస్ పార్టీ ఆ పాటను రూపొందించింది. ఉత్తర ప్రదేశ్ వాసులం అయినందుకు చాలా గర్వంగా ఉంది అనే క్యాప్షన్‌తో ఫిబ్రవరి 4న ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూపీ ఎన్నికల్లో ఓ ఊపు ఊపుతోంది.

  ఈ సాంగ్ గురించి సినీ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేశారు. మీ పాట దేశమొత్తాన్ని ఊపేస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు ట్యాగ్ చేశారు. చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

  VVIP Tree: వీవీఐపీ చెట్టు.. దీనికి 24 గంటలు పోలీస్ సెక్యూరిటీ.. లక్షల్లో ఖర్చు.. ఎందుకు..?

  యూపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌కు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీలో ప్రచారంలో బిజీగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. వీరితో పోల్చితే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి యూపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. అంతా తానై నడిపిస్తున్నారు.

  కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయ తెలిసిందే. మొత్తం 403 సీట్లుంటే.. అందులో 312 స్థానాలను బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు గెలిచాయి. ఈసారి కూడా తామే గెలుస్తామని బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. కమలం పార్టీని చిత్తుగా ఓడిస్తామని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా ఢంకా బజాయిస్తోంది.

  First published:

  ఉత్తమ కథలు