UP ASSEMBLY ELECTIONS 2022 CEC SUSHIL CHANDRA KEY ANNOUNCEMENT ON UTTAR PRADESH ELECTIONS SK
UP Assembly Elections: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన
సీఈసీ సుశీల్ చంద్ర
5 state elections: ఒకవేళ థర్డ్ వేవ్ విజృంభిస్తే.. మరి ఐదు రాష్ట్రాల ఎన్నికల భవిత్యమేంటి? ఎన్నికలను అనుకున్న షెడ్యూల్‌కే నిర్వహిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) క్లారిటీ ఇచ్చింది.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు (5 State Elections) జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)తో పాటు ఉత్తరాఖండ్ (Uttarakhand), పంజాబ్ (Punjab), గోవా (Goa), మణిపూర్ (Manipur)లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అంతలోనే ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. ఈ వేరియెంట్‌తో భారత్‌లో కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అనూహ్యంగా పెరిగిన కేసులతో థర్డ్ వేవ్ మొదలయిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ థర్డ్ వేవ్ విజృంభిస్తే.. మరి ఐదు రాష్ట్రాల ఎన్నికల భవిత్యమేంటి? ఎన్నికలను అనుకున్న షెడ్యూల్‌కే నిర్వహిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహిాంచాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. అందుకే కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. అనుకున్న సమయానికే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Representatives of all political parties met us and told us that elections should be conducted on time following all COVID19 protocols: Chief Election Commissioner Sushil Chandra on 2022 UP Assembly elections pic.twitter.com/0xmDP9rwH1
అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను వెల్లడించారు సీఈసీ. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు కానీ.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ వేళలను మార్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ఉంటుంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ యంత్రాలను అందుబాటులో ఉంచుతారు. అంతేకాదు లక్షకు పైగా పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ సిబ్బందితో పాటు భద్రతా విధులు నిర్వహించే పోలీసులు, కేంద్ర బలగాలకు రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. పోలింగ్ రోజున ఔటర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడతామని.. ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల సంఘం తెలిపింది.
మరోవైపు ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. యూపీ,ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో అన్ని ప్రధాన పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ పడి ప్రచారం చేస్తున్నాయి. హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి యూపీపైనే ఉంది. ఎందుకంటే దేశంలో అతి పెద్ద రాష్ట్రం కావడం, అక్కడ రామ మందిరం నిర్మాణం జరుగుతుండడంతో.. ఈసారి గెలుపు ఎవరిదన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా తమదే విజయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాషాయ దళానికి బిగ్ షాక్ తప్పదని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.